Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి ‘అఖండ’తో ఘన విజయం వచ్చింది. కానీ పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం ఇంకా రాలేదు. ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి రెండు నెలలు కావస్తోంది. అయినా… ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఇప్పటివరకు మరో సినిమాకి సైన్ చేయలేదు. సైన్ చేసే ఆసక్తి ఆమెకు ఉన్నా.. ఎవరూ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి ఒక భారీ హిట్ పడితే.. వెంటనే హీరోయిన్లకు భారీగా అవకాశాలు వస్తాయి. కానీ ఎంత పెద్ద హిట్ వచ్చినా.. ప్రగ్యా ఫేట్ మాత్రం మారడం లేదు.
అయితే, ప్రగ్యా కి ఛాన్స్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఆమె తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిందని.. ప్రస్తుతం ప్రగ్యా ఒక్కో సినిమాకు కోటి రూపాయల పైనే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ‘అఖండ’లాంటి భారీ విజయం వచ్చాక కూడా తాను 50 లక్షలే తీసుకుంటే.. అది తన విజయానికే అవమానం అంటుందట. మొత్తమ్మీద ప్రగ్యా కోటి రూపాయల పారితోషికం తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయింది.
కోటి ఇవ్వలేం అని ఎవరైనా అంటే.. ఎందుకు ఇవ్వరు ? అనేది ఆమె ప్రశ్న. అందుకే, ఇద్దరు సీనియర్ హీరోల సరసన ఆఫర్లు వచ్చినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో నచ్చక, ఆ సినిమాలను ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లో కోటి తగ్గను అంటుంది. మరి ప్రగ్యా డిమాండ్లకు ఓకే చెప్పే నిర్మాతలు ఉన్నారా ? ఇప్పటికే ప్రగ్యా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతుంది. కాగా ఈ పదేళ్లలో ఆమె ఎన్నడూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు.
అందుకే, ఎలాగైనా ఇప్పుడు అయినా కోటి అందుకోవాలని బాగా ముచ్చట పడుతుంది. మరి ప్రగ్యా ముచ్చట తీర్చే నిర్మాత ఎవరు అనేది చూడాలి. నిజానికి ప్రగ్యా జైస్వాల్ కి అన్నీ ఉన్నాయి. కానీ అదృష్టమే లేదు. పైగా ప్రగ్యాకి దర్శకులను ఎలా పట్టుకోవాలి ? అలాగే వాళ్లను ఎలా మెప్పించాలి ? లాంటి విషయాలు కూడా బాగా తెలుసు. కాకపోతే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది ప్రగ్యా జైస్వాల్ కెరీర్.
భారీగా అందాల ఆరబోసినా, ఆమెకు మాత్రం ఐటమ్ సాంగ్స్ ఇచ్చారు గానీ, హీరోయిన్ గా పెద్ద ఛాన్స్ లు ఇవ్వలేదు. కానీ అఖండ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పెద్ద హిట్ కొట్టింది. అందుకే డిమాండ్ చేస్తోంది.