Upasana: వెంట్రుకలుంటే కొప్పు ఎంత అందంగానైనా వేసుకోవచ్చు. అదే వెంట్రుకలు లేకపోతే కొప్పు వేయడం సాధ్యమవుతుందా. అందుకే అంటారు వెంట్రుకలున్న కొప్పు ఎటు వేసినా అందమే. డబ్బున్న వారు ఏం చేసినా చెల్లుతుంది. అదే పేదవాడు కనీస మూడు పూటలు తినడానికి కూడా కష్టపడాల్సిందే. బాగా డబ్బున్న వారు తమ విలాసవంతమైన వాటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఎన్ని కోట్లయినా వెచ్చిస్తారు. తమకు కావాల్సింది సొంతం చేసుకుంటారు. అది సోషల్ స్టేటస్ గా అనుకుంటారు. తాజాగా మెగాస్టార్ కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల ఓ విలాసవంతమైన కారు కొనుగోలు చేసి తానేమిటో నిరూపించుకుంది.

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. ఆడి కంపెనీకి చెందిన ఈ కారుకు రూ. 1.66 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. కానీ కారులో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాసన అపోలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూసుకోవడంతో ఆమె బిజీ లైఫ్ నే గడుపుతోంది. ఎప్పుడు సెలబ్రిటీలతో సమావేశాలు, ఇంటర్వ్యూలు, సలహాలు, సూచనలు ఇస్తూ ఆరోగ్య విషయాలపై ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. అందుకే ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
మారుతున్న సమాజంతో మనం కూడా మారాల్సిన అవసరం ఉంటుందని ఉపాసన చెబుతున్నారు. ఖరీదైన కారు కాదు మనకు ఎప్పుడు సౌకర్యవంతంగా ఉండే వాటిని కొనుగోలు చేయడం మనకున్న అలవాటుగానే సూచిస్తున్నారు. అందుకే ఆడి ఇ ట్రాస్ ను కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. మనకున్న బాధ్యతల నేపథ్యంలో ప్రయాణం చేయడం ఓ సాధారణమైన విషయం కావడంతో ఎప్పటికప్పుడు త్వరగా వెళ్లేందుకు అధునాతన వాహనాలు కొనుగోలు చేయడంలో తప్పు లేదని చెప్పుకొచ్చారు.

ఇక తన కారును సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఎంత సౌకర్యవంతంగా ఉందో వివరిస్తున్నారు. ఎలక్ర్టికల్ కారు కావడంతో
కారులోని సదుపాయాలు ఒక్కొక్కటి చూపిస్తూ అభిమానులతో సందడి చేస్తున్నారు. రాంచరణ్ భార్యగా ఉపాసన చేస్తున్న సేవలపై ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక బాధ్యతగా ఆరోగ్య విషయాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపాసన చేస్తున్న కృషిని ప్రశంసిస్తున్నారు. భావిభారత ప్రజలకు అండగా ఉండే ఎన్నో హెల్త్ టిప్ లను అందిస్తూ దూసుకుపోవడం నిజంగా మంచిదే.