Ramcharan Watch: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి జరిగిన దగ్గర నుంచి వీరి పెళ్లి లో ఎవరు ఏం ధరించారు. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు అనే వివరాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లికి చాలా కొద్ది మంది మాత్రమే హాజరైన విషయం తెలిసిందే. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇక రామ్ చరణ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన రామ్ చరణ్ గురించి ప్రతి చిన్న అంశం కూడా వైరల్ అవుతుంది. ఇదే తరహాలో వరుణ్ పెళ్లి లో చెర్రీ చేతికి ధరించిన వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆయన పెట్టుకున్న వాచ్ విలువ తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే..
ఇంతకీ రామ్ చరణ్ చేతికి ఎన్ని కోట్ల వాచ్ పెట్టుకున్నారో తెలుసా? మెగా పవర్ స్టార్ చెర్రీ ఈ మధ్యనే తన తమ్ముడు వరుణ్ తేజ్ పెళ్లికి ఉపాసన, కూతురు క్లింకారాతో కలిసి వెళ్లారు. పెళ్లిలో చెర్రీ, ఉపాసన చాలా సింపుల్ గా కనిపించారు. కానీ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ ఖరీదైనవే. డ్రెస్సింగ్ సింపుల్ గా ఉన్న.. చెర్రీ వాచ్ మాత్రం అదిరిపోయే ధర అని తెలుస్తోంది. ఈ స్టార్ హీరోకి వాచ్ కలెక్షన్లు అంటే చాలా ఇష్టమట. అందుకే కోట్లు విలువ చేసే వాచ్ లు కొనుగోలు చేస్తారని టాక్. ఇప్పటికే ఆయన దగ్గర ఎన్నో ఖరీదైన వాచ్ లు కూడా ఉన్నాయట.
వరుణ్, లావణ్యల పెళ్లిలో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు కూడా చాలానే అని తెలుస్తోంది. పెటల్ ఫిలిప్స్ మోడల్ కి చెందిన వాచ్ పెట్టుకున్నారని టాక్. దీనికి ఏకంగా 2,85,000 డాలర్లు అని సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2 కోట్ల 85 లక్షలు ఉంటుందట. కేవలం చేతికి పెట్టుకునే వాచ్ ధర రెండు కోట్ల పైచిలుకు అని తెలియడంతో నెటిజన్లే కాదు మెగా అభిమానులు కూడా ఆశ్యర్యపోతున్నారు. అయినా అది మా చెర్రీ అన్న రేంజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయినా వాచ్ ఖరీదు కేవలం రెండు కోట్ల 85 లక్షలు అంటే.. పేదవాడి జీవితంలో ఒక సంవత్సరంలో అయినా 85 లక్షలు ఖర్చు చేయరు. అలాంటిది వీరి చేతికి పెట్టుకునే వాచ్ ఈ రేంజ్ లో ఖరీదు చేస్తుందా అని నోరెళ్ల బెడుతున్నారు నెటిజన్లు.