Homeఎంటర్టైన్మెంట్Kamal Haasan - Director Shankar : డైరెక్టర్ శంకర్ కు కమల్ హాసన్ ఇచ్చిన...

Kamal Haasan – Director Shankar : డైరెక్టర్ శంకర్ కు కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఖరీదైన బహుమతి ధర ఎంతో తెలుసా?

Kamal Haasan – Director Shankar : కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ది క్రేజీ కాంబినేషన్. వారిద్దరి కలయికతో వచ్చిన భారతీయుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ దీ బెస్ట్ మూవీగా నిలిచింది. చాలా రోజుల తరువాత ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. భారతీయుడు 2 సినిమా ప్రాజెక్టును శంకర్ పట్టాలెక్కించారు. సినిమా ప్రారంభం తరువాత ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటి అధిగమించి సినిమాను పూర్తిచేయడంలో శంకర్ కీలక పాత్ర వహించారు. అయితే సినిమాను శంకర్ తీర్చిదిద్దుతున్న విధానానికి కమల్ ఫిదా అయినట్టు తెలుస్తోంది. ఏకంగా ఓ బహుమతి ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు కమల్ హాసన్.

ఈ చిత్రంలో కమల్ హాసన్ కథనాయకుడు కాగా.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరిదశలో ఉంది. భారీ యాక్షన్ సిక్వెల్స్ తో సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇందులో కొన్ని స్టంట్స్, పతాక సన్నివేశాలు చూసి కమల్ ఆశ్చర్యపోయారు. శంకర్ పడుతున్న తపన, ఆయన చిత్రీకరిస్తున్న తీరు చూసి కమల్ అచ్చెరువొందారుట. దీంతో తన అభిమానాన్ని ఉంచుకోలేకపోయారుట. అప్పటికప్పుడు ఒక వాచన్ ను శంకర్ కు బహుకరించారుట. దీని విలువ అక్షరాలా రూ.8 లక్షలు.

బహుమతి ఇవ్వడమే కాదు. కమల్ శంకర్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. భారతీయుడు 2 చిత్రంలో కీలక సన్నివేశాలు చూశా. ఈ సినిమాయే మీ అత్యుత్తమ వర్క్ కాకూడదు. ఇంకా మీరు శిఖరాగ్రానికి ఎదగాలి. మీ నుంచి ఎన్నో అద్భుత కళాఖండాలు జాలువారాలి. ఈ ఒక్క సినిమాతో మీరు గర్వపడకండి అంటూ కమల్ ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ అవుతోంది. దర్శకుడు శంకర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు భారతీయుడు 2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular