Sreeleela: మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో మంగళవారం రాత్రి జరిగింది. కాగా హీరోయిన్ శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చీర కట్టులో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది.
కాగా ఆమె కట్టుకున్న చీర గురించి చర్చ మొదలైంది. శారీ చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ దాని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి సెలెబ్రెటీలు వేసుకుంటున్న దుస్తుల, వాళ్లకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు అభిమానులు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ శారీ ఎక్కడ దొరుకుతుంది.
కాస్ట్ ఎంత అని వెతకడం మొదలు పెట్టారు. ‘ బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ ‘ పేరుతో అది ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఈ డిజైనర్ వేర్ శారీ ధర రూ. 1,59,000. దాంతో ఒక్క చీర ధర అన్ని లక్షలా అని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో .. అంత రేటా అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే .. మహేష్ బాబు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు. ప్రతి సంక్రాంతి నాకు, నాన్న గారికి బాగా కలిసొచ్చింది అని అన్నారు.
సంక్రాంతి కి సినిమా రిలీజ్ అయిన ప్రతి సారి .. నాన్న గారు ఫోన్ చేసేవారు. నేను ఆయన కాల్ కోసం ఎదురు చూసే వాడిని. కానీ ఇప్పుడు నాన్న గారు లేరు. కాబట్టి అవన్నీ మీరే చెప్పాలి. నాకు ఇక అమ్మా – నాన్నా మీరే అంటూ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యాడు. గుంటూరు కారం మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
View this post on Instagram