Rajendra Prasad- Senior NTR: నటనలో తనదైన ముద్ర వేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్. సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు. హాస్య సినిమాలే ప్రధానంగా తీసిన ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలతో తనలో ఓ సీరియస్ నటుడు ఉన్నాడని నిరూపించాడు. అందరు సినిమాల్లోకి రావడానికి కష్టాలు పడ్డా ఇతడికి మాత్రం అవకాశాలు అందివచ్చాయి. ఫలితంగా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.
ఎన్టీఆర్ సొంతూరు గుడివాడ దగ్గర నిమ్మకూరు. వారి ఊరికి సమీపంలో ఉండే దొండపాడు రాజేంద్ర ప్రసాద్ సొంతూరు. నటనపై ఉన్న మక్కువతో సీనియర్ ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సినిమాల్లోకి రావాలంటే ఏం చేయాలని ఎన్టీఆర్ ను ప్రశ్నిస్తే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పడంతో కామెడీనే ప్రధానంగా ఎంచుకుని సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. ప్రతి సినిమాను ఓ చాలెంజ్ గా తీసుకుని తన నటన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఫలితంగా హీరోగా కూడా తన మార్కును ప్రదర్శించాడు.
Also Read: Vijaya Devarakonda: ఇండస్ట్రీలోకి రావడానికి విజయ్ దేవరకొండ తేజా దగ్గర ఆ పనిచేశాడా?
తొలి సినిమాను బాబు దర్శకత్వంలో చేసినా రెండో సినిమా వంశీ దర్శకత్వంలో వచ్చిన మంచుపల్లకిలో చిరంజీవితో కలిసి నటించాడు. తరువాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి అహనా పెళ్లంట సినిమా జంధ్యాల దర్శకత్వంలో హీరోగా మారాడు. ఇక అక్కడ నుంచి వెనుదిరగలేదు. తనకు వచ్చిన కామెడీని ప్రధానంగా చేసుకుని సినిమాలు చేసి అందరిని మెప్పించాడు. ఫలితంగా కామెడీ హీరో అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాల్లో తన సత్తా చాటాడు.
ఇక మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు డబ్బింగ్ చెప్పిన రాజేంద్ర ప్రసాద్ అని ఆ చిత్ర నిర్మాత అశ్వనీదత్ స్వయంగా ఈ విషయం చెప్పారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర పెట్టాలని అనుకుంటే అప్పటికే బాలయ్య తన తండ్రి బయోస్కోప్ తీస్తుండటంతో సీనియర్ ఎన్టీఆర్ ను రెండు మూడు సీన్లలో చూపించి ఆ పాత్రకు రాజేంద్రప్రసాద్ తో డబ్బింగ్ చెప్పించారట. ఈ విషయం అలీతో సరదాగా కార్యక్రమంలో అశ్వనీదత్ స్వయంగా వెళ్లడించడంతో వెలుగులోకి వచ్చింది.