Ram Charan and Allu Arjun : ప్రస్తుతం మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ పరంగా ఏ రేంజ్ వసూళ్లను చూస్తూ ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాము. వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే వేరే లెవెల్ లో మన హీరోలకు ఎలివేషన్స్ ఇచ్చుకునేవాళ్ళం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కేవలం మొదటి రోజు వస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రానికి ఏకంగా 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మొదటి రోజు వచ్చింది. ఇది సాధారణమైన రికార్డు కాదు. రాజమౌళి లాంటి దర్శకుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోలను పెట్టి తీసినా కూడా ఈ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు రాలేదు. ఇది ఇలా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ కి మంచి రోజులొచ్చాయి. దర్శక నిర్మాతలు అడిగినంత రేట్స్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం.
మొన్న విడుదలైన ‘దేవర’ చిత్రానికి కానీ, నిన్న విడుదలైన ‘పుష్ప 2’ చిత్రానికి కానీ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదనపు షోస్, బెనిఫిట్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చేసాయి ప్రభుత్వాలు. దీంతో చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రేంజ్ ఓపెనింగ్ వసూళ్లను చూసే అదృష్టం దొరికింది ప్రేక్షకులకు. అయితే ‘పుష్ప 2’ హైదరాబాద్ ప్రీమియర్ షోస్ లో జరిగిన ఒక దుర్ఘటన, ఇప్పుడు యావత్తు సినీ పరిశ్రమని రిస్క్ లో పడేలా చేసింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పుష్ప ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ రావడం, ఆ సమయంలో ఆయన్ని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరళి రావడంతో తొక్కిసిలాట కారణంగా ఒక మహిళ మృతి చెందడం వంటి దుర్ఘటనలు జరిగాయి. దీనికి ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది. ఇక మీదట విడుదల అవ్వబోయే సినిమాలకు బెన్ఫిట్ షోస్ కి అనుమతిని ఇవ్వబోమని అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం.
అదే విధంగా టికెట్ రేట్స్ విషయంలో కూడా ఒకసారి పునరాలోచన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా పడే అవకాశం ఉంది. ‘దేవర’, ‘గేమ్ చేంజర్’ చిత్రాలకు ఇచ్చినట్టుగా టికెట్ రేట్స్, బెన్ఫిట్ షోస్ కి అనుమతులు తదుపరి రాబోయే సినిమాలకు ఇవ్వకపోవచ్చు. జనవరి 10వ తారీఖున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఈ ప్రభావం ఆ సినిమా మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమారుగా ఆరేళ్ళ తర్వాత రామ్ చరణ్ నుండి రాబోతున్న సోలో హీరో చిత్రమిది. ఈ సినిమా మీద అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. టీజర్, పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్.