దాదాపుగా ప్రతీ సినిమా కథ ఎవరో ఒక హీరో కోసమే ప్రాణం పోసుకుంటుంది. మనసులో ఆ హీరోను తలుచుకునే పేపర్ పై పెన్ను పెడతాడు రచయిత. అయితే.. ఆ లైన్ పూర్తిస్థాయి స్టోరీగా మారి, సెట్స్ మీదకు వెళ్లే నాటికి ఏదైనా జరగొచ్చు. ఒక హీరో చేయాల్సిన సినిమాలో మరో నటుడు కనిపించొచ్చు. ఒక నటుడి కోసం సిద్ధం చేసిన కథ.. వేరే స్టార్ చేతిలోకి వెళ్లిపోవచ్చు. చాలా మంది హీరోల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవాళ బన్నీ బర్త్ డే సందర్భంగా.. ఆయన వదులుకొని, సూపర్ హిట్ అయిన సినిమాలను చూద్దాం.
గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన బన్నీ.. ఆ తర్వాత ఆర్యతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సమయంలో మంచి ఊపుమీదున్న స్టైలిష్ స్టార్ వద్దకు ‘భద్ర’ సినిమా కథతో వెళ్లాడు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. అయితే.. వెంటనే యాక్షన్ హీరో అంటే ఎలా ఉంటుందోనని నో చెప్పాడట. దీంతో.. ఆ సినిమా రవితేజ హీరోగా తెరకెక్కింది. మాస్ రాజా కెరీర్లో అద్భుతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది భద్ర.
చాలా కాలం తర్వాత ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. ఈ స్టోరీని కూడా బన్నీని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేశాడ దర్శకుడు సందీప్. మరీ బోల్డ్ గా ఉందని, మత్తుకు బానిసవడం వంటి కారణాలతో బన్నీ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేతిలోకి వెళ్లిన ఈ సినిమా.. ఏ స్థాయిలో హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్.
ఈ సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్ ‘గీత గోవిందం’ను మొదటగా అల్లు అర్జున్ కే పరిచయం చేశాడట. కానీ.. సినిమా మొత్తం హీరోయిన్ డామినేషన్ సాగడం వంటి కారణాలతో బన్నీ నో చెప్పినట్టు సమాచారం. అయితే.. ఈ సినిమా కూడా విజయ్ దేవరకొండ వద్దకు చేరడం.. అది కూడా సూపర్ హిట్ అవడం విశేషం.
బన్నీకి స్టార్ స్టాటస్ తీసుకొచ్చిన దర్శకుడు సుకుమార్ ‘జగడం’ సినిమాను స్టైలిష్ స్టార్ తోనే చేయాలని అనుకున్నాడు. బన్నీ ఓకే కూడా చెప్పాడు. కానీ.. సినిమా నిర్మాత దిల్ రాజుతో చిన్న సమస్య తలెత్తడంతో సుకుమార్ ఎమోషన్ అయ్యారట. వెంటనే ఎనర్జిటిక్ హీరో రామ్ దగ్గరకు వెళ్లి కథ వినిపించి, ఒప్పించి, సినిమా తీశారు. అయితే.. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ విధంగా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను బన్నీ వదులుకున్నాడు. ఇవే గనక అతను చేసి ఉంటే..?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you know the hit films that bunny lost
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com