Film Industry : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట 100 కోట్లు సాధించిన సినిమా ఏది అనేది మనలో చాలామందికి తెలియదు. అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా మొదట 100 కోట్లు రాబట్టిన సినిమా హీరో ఎవరు అనేది తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు…
సినిమా ఇండస్ట్రీలో హీరోల క్రేజ్ అనేది రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు సాధించే విజయాలతోనే వాళ్ళ మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా పెరుగుతుంది. ఇక ఏ హీరో అయితే ఇండస్ట్రీలో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్లను కొడుతూ ముందుకు సాగుతూ ఉంటాడో వాళ్ళ క్రేజ్ అయితే అమాంతం తారాస్థాయికి పెరిగిపోతుందనే చెప్పాలి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు 2000 కోట్ల మార్క్ ను కూడా కొల్లగొడుతుంది. కానీ మొదట 100 కోట్ల మార్కును టచ్ చేసిన సినిమా ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికి భారీ విజయాలను సాధిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన చాలామంది హీరోలు ఇండస్ట్రీ హిట్లను సైతం నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో రామ్ చరణ్ తన రెండో సినిమా అయిన మగధీర సినిమాతోనే భారీ ఇండస్ట్రీ హిట్ ని కొట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా మొదట 100 కోట్లు నమోదు చేసిన తెలుగు సినిమాగా మంచి గుర్తింపును సంపాదించుకుంది…
ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సైతం మొదట 100 కోట్లు మార్క్ సాధించిన సినిమా ఏంటి అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక శంకర్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ సినిమా మొదట వందకోట్ల మార్కును టచ్ చేసింది. ఇక ఆ తర్వాత రోబో సినిమాతో మరోసారి 300 కోట్ల మార్కును అందుకున్నాడు. ఇక సౌత్ ఇండియా లోనే ఆ ఫీట్ సాధించిన తొలి పాన్ ఇండియా డైరెక్టర్ గా కూడా శంకర్ అవతరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ఇప్పటివరకు సౌత్ లో వచ్చిన సినిమాలు ఓకేత్తయితే ఇక మీదట నుంచి రాబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఇంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ వరల్డ్ లోకి వెళ్లబోతుంది…