NTR: ఎన్టీయార్ చేసిన సినిమాల్లో వాళ్ల అమ్మకి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ తో కూడా ఇప్పటివరకు తను ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పిందట..ఇక ఆయన నటించిన సినిమాల్లో కెల్లా టెంపర్ సినిమాలో ఆయన చేసిన నటన చాలా డెప్త్ తో ఉంటుంది.

Written By: Gopi, Updated On : March 10, 2024 6:11 pm

NTR

Follow us on

NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన సినిమాలు నందమూరి అభిమానులను అలరించడమే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా ఆయనకి మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టాయి. దానివల్ల ఆయనకు యంగ్ టైగర్ ఎన్టీయార్ అనే పేరు కూడా వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ అయిన శాలిని గారికి ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల్లో టెంపర్ సినిమా అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే దాంట్లో ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి ఎన్టీఆర్ చేసే పోరాటం కానీ, చివర్లో నేరం చేసిన వారు తప్పించుకుంటూన్నారు అనే అవేదనతో ఆయన చెప్పే డైలాగులు గాని బాగుంటాయని ఆమె తమ సన్నిహితుల దగ్గర ఎపుడు చెబుతూ ఉంటుందట. ఇక ఆమె తీరిక దొరికిన ప్రతి సారి ఈ సినిమా చూస్తూ కూర్చుంటారట.

అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఎన్టీఆర్ తో కూడా ఇప్పటివరకు తను ఈ సినిమా గురించి చాలా సార్లు చెప్పిందట..ఇక ఆయన నటించిన సినిమాల్లో కెల్లా టెంపర్ సినిమాలో ఆయన చేసిన నటన చాలా డెప్త్ తో ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయినట్లయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ మార్కెట్ ను పొందుతాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటికే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ ఈ రెండు సినిమాలతో కనక ఆయన సత్తా చాటితే ఎన్టీఆర్ పేరు పాన్ ఇండియాలో మారుమ్రోగిపోతుందనే చెప్పాలి…