https://oktelugu.com/

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి ఖర్చు అన్ని కోట్లా… ఎన్ని డబ్బులు ఉన్నాయి సామీ!

జూన్ 2, 3 తారీఖుల్లో శర్వానంద్ వివాహం. సాధారణంగా సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. శర్వానంద్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు. రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం జరుగుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : May 22, 2023 / 09:02 AM IST

    Sharwanand Marriage

    Follow us on

    Sharwanand Marriage: శర్వానంద్ మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆయన రక్షిత రెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురైన రక్షితతో జనవరిలో శర్వానంద్ కి నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. టాలీవుడ్ స్టార్స్ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అయితే పెళ్లి అంతకు మించి ప్లాన్ చేస్తున్నారట. జీవితంలో ఒకేసారి జరిగే ఈ వేడుకకు శర్వానంద్ కోట్ల బడ్జెట్ కేటాయించారట. దీనికి సంబంధించి టాలీవుడ్ లో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

    జూన్ 2, 3 తారీఖుల్లో శర్వానంద్ వివాహం. సాధారణంగా సెలెబ్రిటీలు డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. శర్వానంద్ కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు. రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం జరుగుతుంది. ప్రముఖ లీలా ప్యాలస్ శర్వానంద్ పెళ్లికి వేదిక అయ్యింది. లీలా ప్యాలస్ లోనే మెహందీ, హల్దీ, సంగీత్ వంటి వేడుకలు నిర్వహించనున్నారు. షాకింగ్ న్యూస్ ఏమిటంటే అత్యంత ధనవంతులు మాత్రమే లీలా ప్యాలస్ లో వివాహం చేసుకుంటారట.

    లీలా ప్యాలస్ లో వేడుక చేసుకుంటే రోజుకు రూ. 4 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంటే రెండు రోజులకు రూ. 8 కోట్లు. ఇక విందులు, వినోదాలు, దుస్తులు, ఇతర ఏర్పాట్లకు మరికొంత ఖర్చు చేయనున్నారు. అంటే రూ. 10 కోట్ల వరకు శర్వానంద్ పెళ్లికి ఖర్చు చేయనున్నారట. చెప్పాలంటే ఇది ఆయన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే. ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా ఈ పెళ్లిని శర్వానంద్ ప్లాన్ చేస్తున్నారట.

    శర్వానంద్ పేరుకే టైర్ టూ హీరో. సంపదలో మాత్రం స్టార్ హీరోలు సరిపోరు. శర్వానంద్ కుటుంబానికి హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఆయన ఆర్థికంగా ఉన్నతమైన ఫ్యామిలీలో పుట్టాడు. ఇక అమ్మాయి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ కూడా తక్కువ కాదు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలట. రక్షిత రెడ్డి కూడా కోటీశ్వరుల అమ్మాయి. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ ప్లాన్ చేశారు. పాన్ ఇండియా మూవీ రేంజ్ లో భారీగా నిర్వహించేందుకు ప్రణాళికలు వస్తున్నారు.