Nayantara House: నయనతార ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్‌తో దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తోంది. పైగా తమ సంసారం సాఫీగా సాగడానికి నయనతార అన్ని విధాలుగా తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇప్పటికే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఇళ్లు వేద నిలయానికి సమీపంలోనే నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేయడం విశేషం.
పొయెస్ గార్డెన్ లో ఎక్కువగా సినీ ప్రముఖులే నివాసముంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు ఎందరో తమిళ సినీ దిగ్గజాలు ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. అందుకే.. ఈ ప్రాంతంలో స్థలం చాలా ఖరీదు. అసలు ఇక్కడ స్థలాన్ని అమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. అలాంటి ప్రాంతంలో నయనతార ఏకంగా రెండు ఇళ్లు కొనుగోలు చేయడంతో ఈ టాపిక్ ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ నయనతార కొనుగోలు చేసిన ఇల్లు విస్తీరణం ఎంతో తెలుసా ?.. అక్షరాల ఎనిమిది వేల చదరపు అడుగులు.
Also Read: Gopichand In NTR Movie: ఎన్టీఆర్ సినిమాలో గోపీచంద్.. ఫాన్స్ కి ఇక పండగే
ఇక నయనతార కొన్న ఒక్కో ఇంటి ఖరీదు ఎంతో తెలుసా ? 26 కోట్ల రూపాయలు. అంటే.. రెండు ఇల్లులు కలిపి 52 కోట్లు. అందుకే.. ఇప్పుడు నయన్ కొన్న ఇళ్ల పైనే కోలీవడ్ ఆసక్తిగా చూస్తోంది. ఏది ఏమైనా లేడీ సూపర్ స్టార్ నయనతారకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె ఏమి మాట్లాడినా ఎప్పుడు హాట్ టాపికే అవుతుంది.
నిజానికి నయనతార వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలున్నాయి. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారాలతో చాలా నలిగిపోయింది ఆమె. ‘ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తాను, సెట్ కాదు అనుకుంటే అంతే నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తాను’ అని నయనతార తరుచూ చెబుతూ ఉంటుంది. పైగా పెళ్లి అయ్యాక ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నయనతార ప్రేమ పాఠాలు చెప్పింది.
‘ప్రేమలో నిజాలు అరుదుగా బయటకు వస్తాయి. కానీ, ప్రేమ ఎప్పుడూ అబద్ధాల మీద ఆనందంగా ఉంటుంది. అంతేకాదు అబద్ధాలనే ప్రేమికులు ఎక్కువగా నమ్ముతారు’ అంటూ నయనతార తన ప్రేమ తత్వాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికి.. ప్రేమ జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న నయనతార.. దాంపత్య జీవితంలో మాత్రం విఘ్నేష్ శివన్‌తో చాలా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఓ నెటిజన్ ఇదే విషయాన్ని పోస్ట్ చేస్తూ ‘ప్రియమైన నయన్.. ఎన్నో ప్రేమలతో నలిగిపోయావ్.. కనీసం దాంపత్యంలో అయినా సంతోషంగా ఉండు’ అని పోస్ట్ చేశాడు.
Also Read:Chor Baazar 12 Days Collections: ‘చోర్ బజార్’ 12 డేస్ కలెక్షన్స్.. నష్టాల పుట్ట ఇది
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More