Baby Director Sai Rajesh: బేబీలో బోల్డ్ సీన్స్ చేసేందుకు వైష్ణవి పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా?… షాకింగ్ మేటర్ లీక్ చేసిన డైరెక్టర్

బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఆర్ఎక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ తరహా రోల్ చేసింది. వైష్ణవి చైతన్య సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. అదే సమయంలో ఆమె సోషల్ మీడియా నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కేవలం క్యారెక్టర్ గా చూడకుండా ఆమెను బ్లేమ్ చేస్తున్నారు. బేబీ మూవీలో వైష్ణవి ఫ్రెండ్ రోల్ చేసిన నటిని కొందరు వేధించారట. బేబీ మూవీ ప్రేక్షకుల మీద అంతగా ప్రభావం చూపింది. ఇది ముందుగానే ఊహించిన వైష్ణవి చైతన్య దర్శకుడితో ఒప్పందం చేసుకున్నారట.

Written By: Shiva, Updated On : July 26, 2023 5:04 pm

Baby Director Sai Rajesh

Follow us on

Baby Director Sai Rajesh: హీరోయిన్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అటూ ఇటూ అయితే మొత్తంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇందుకు కొందరు హీరోయిన్స్ కెరీర్స్ ఉదాహరణ. ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అయితే ఆమె నెగిటివ్ రోల్ చేయడం చాలా మైనస్ అయ్యింది. తర్వాత ఆమెకు సరైన ఆఫర్స్ రాలేదు. వచ్చిన ఒకటీ రెండు బెటర్ ఆఫర్స్ బాక్సాఫీస్ వద్ద వర్క్ అవుట్ కాలేదు. దర్శకులు పాయల్ అంటే ఆ తరహా పాత్రలకే అని పరిమితం చేశారు. పాయల్ టాలీవుడ్ లో ఎదగకపోవడానికి ఇది ప్రధాన కారణం.

బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఆర్ఎక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ తరహా రోల్ చేసింది. వైష్ణవి చైతన్య సాహసాన్ని అందరూ కొనియాడుతున్నారు. అదే సమయంలో ఆమె సోషల్ మీడియా నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కేవలం క్యారెక్టర్ గా చూడకుండా ఆమెను బ్లేమ్ చేస్తున్నారు. బేబీ మూవీలో వైష్ణవి ఫ్రెండ్ రోల్ చేసిన నటిని కొందరు వేధించారట. బేబీ మూవీ ప్రేక్షకుల మీద అంతగా ప్రభావం చూపింది. ఇది ముందుగానే ఊహించిన వైష్ణవి చైతన్య దర్శకుడితో ఒప్పందం చేసుకున్నారట.

ఈ మేరకు సాయి రాజేష్ కీలక సమాచారం లీక్ చేశాడు. స్క్రిప్ట్ విన్నాక వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేయను అన్నారట. బోల్డ్ సన్నివేశాలతో కూడిన నెగిటివ్ రోల్ కావడంతో కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెనక్కి తగ్గిందట. అయితే సాయి రాజేష్ మరో మూడు సినిమాలు ఆమెకు ఆఫర్ చేశాడట. నీ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు. బేబీ మూవీ ఆడినా ఆడకున్నా తాను, తన మిత్రులు నిర్మించే చిత్రాల్లో నీకు ఛాన్సులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడట. అప్పుడు వైష్ణవి చైతన్య ముందుకు వచ్చిందట.

బోల్డ్ సన్నివేశాల గురించి వైష్ణవి నాన్నకు చెప్పి, ఆయన అనుమతి తీసుకున్నాకే తెరకెక్కించమని సాయి రాజేష్ చెప్పుకొచ్చారు. ఆయన మాటల ప్రకారం ఎస్ కే ఎన్, మారుతి, బన్నీ వాసు నిర్మించే తదుపరి చిత్రాల్లో వైష్ణవి చైతన్యకు ఆఫర్స్ ఇవ్వనున్నారు. వైష్ణవి, ఆనంద్ దేవరకొండ, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ మూవీ అరవై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.