
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే.నిన్నటితో ఈ చిత్రం 67 డైరెక్టు కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకుంది.గడిచిన రెండేళ్లలో ఒక సినిమా ఇన్ని కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోవడం మనం చూడలేదు, కారణం ఓటీటీ.
ఏ సినిమా అయినా మూడు వారాలకే ఓటీటీ లో వచేస్తుండడం తో ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాలను చూడడం మానేశారు.సరిగ్గా థియేటర్స్ లో నిలబడి రెండు వారాలు ఆడడమే గగనం అయిపోతుంది.అలాంటి రోజుల్లో చిరంజీవి ఒక మామూలు కమర్షియల్ సినిమాతో ఈ రేంజ్ విద్వంసం సృష్టించడం అంటే మెగాస్టార్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.నిన్న 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ లో
స్పెషల్ షోస్ నిర్వహించారు.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ షోస్ నుండి దాదాపుగా 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతం లోని ఫేమస్ థియేటర్ సంధ్య 70MM లో నిన్నటితో ఈ సినిమా కోటి రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

కేవలం ఈ ఒక్క థియేటర్ నుండే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు 5 లక్షల వరకు ఉంటుందని అంచనా.అలాగే వైజాగ్ , కాకినాడ, రాజముండ్రి వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి స్పెషల్ షోస్ ని నిర్వహించగా కలెక్షన్స్ అదిరిపోయాయి.అలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 50 వ రోజు 40 లక్షలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందట.ఇది టాలీవుడ్ హిస్టరీ లోనే అరుదైన రికార్డు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.