https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఫినాలే ఎప్పుడో తెలుసా.. చీఫ్ గెస్ట్ గా ఎవరొస్తున్నారంటే…

Bigg Boss 5 Telugu: అతి పెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో పదిహేనేళ్ల క్రితం మొదలైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. బిగ్ బాస్ షో ను ఎంత ఇష్టపడతారో అంతే విధంగా విమర్శిస్తారు కూడా. తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ కి యంగ్ టైగర్ హోస్ట్ గా […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 21, 2021 / 10:01 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: అతి పెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో పదిహేనేళ్ల క్రితం మొదలైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. బిగ్ బాస్ షో ను ఎంత ఇష్టపడతారో అంతే విధంగా విమర్శిస్తారు కూడా. తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

    మొదటి సీజన్ కి యంగ్ టైగర్ హోస్ట్ గా వ్యవహరించగా… రెండవ సీజన్ కి గానూ నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వవ్యహరించారు. వరుసగా మూడవ, నాల్గొవ, ఐదో సీజన్లకి కి గాను టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిగ్ బాస్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాడు.

    Bigg Boss 5 Contestants

    అయితే బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి అంకానికి చేరబోతున్నది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. మొదటి వరం నుండి ఇప్పటి వరకు) బిగ్ బాస్ నుండి పది మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ ) ఎలిమినేట్ అయ్యారు.

    మొత్తం 105 రోజులలో ఇప్పటికే 77 ముగిసాయి. ఇంక బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫినాలే దగ్గర పడటం వలన కంటెస్టెంట్స్ లో కూడా ఒక రకమైన టెన్షన్ అలుముకుంది. అయితే ఫినాలే ఎపిసోడ్ ఏ తారీఖున జరుగుతుంది అన్న ప్రస్తావన ఇంతవరకు రాలేదు. అయితే డిసెంబర్ పందొమ్మిది న ఫైనల్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం. అయితే చీఫ్ గెస్ట్ గా సెలెబ్రిటీ వస్తున్నారని వినికిడి. కానీ, ఆ సెలబ్రిటీ ఎవరు అనేది ఇంతవరకు తెలియదు. మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో ఏ గెస్ట్ తావులేదు. రెండో సీజన్ కి గాను దగ్గుబాటి వెంకటేష్ విచ్చేయగా.. మూడో సీజన్, నాలుగో సీజన్ కి గాను చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్ కి విచ్చేసి ట్రోఫీ అందచేసాడు. మరి ఐదో వారానికి గాను ఏ సెలబ్రిటీ వస్తాడనే విషయం పైన ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.

    Tags