https://oktelugu.com/

Game Changer : గేమ్ చేంజర్ మూవీ లో రామ్ చరణ్ ను వెన్ను పోటు పొడిచే నటుడు ఎవరో తెలుసా..?

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో రామ్ చరణ్ ఒకరు.

Written By:
  • Gopi
  • , Updated On : January 2, 2025 / 02:07 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో రామ్ చరణ్ ఒకరు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించేది దిశ గా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… మరి ఇప్పుడు ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడానికి రెఢీ అవుతుంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అనేది అటు రామ్ చరణ్ కి ఇటు శంకర్ కి ఇద్దరికి చాలా కీలకమనే చెప్పాలి…

    రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ తన స్టామినాని చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తన సమకాలీన హీరో ఆయన అల్లు అర్జున్ ప్రస్తుతం 2000 కోట్ల మార్కును చేరుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో 1300 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ఈజీగా 1500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. మరి ఈ సినిమా ఇప్పటివరకు చాలా మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంది… ఇక ఇప్పటికే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు యూ బై ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే…

    ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. మరి తనని వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ లో ఎస్ జే సూర్య నటించినట్టుగా తెలుస్తోంది… అసలు ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. ఆయన ఎందుకని రామ్ చరణ్ ను వెన్నుపోటు పొడవాల్సి వచ్చింది.

    ఆయన ఏదైనా స్కాం చేశాడా లేదంటే రామ్ చరణ్ ఫ్రెండ్ గానే ఉంటూ తనకు తెలియకుండానే అతని ఉద్యోగాన్ని ఊడగొట్టే ప్రయత్నం చేశాడా అనే ధోరణిలో ఇప్పుడు ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక వీటన్నింటికీ సమాధానం దొరకాలి అంటే మాత్రం జనవరి 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయితే గాని సరైన క్లారిటీ రాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు… మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం ఆయనకంటూ ఒక భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందనే చెప్పాలి. లేకపోతే మాత్రం రామ్ చరణ్ ‘గ్లోబల్ స్టార్’ గా సంపాదించుకున్న క్రేజ్ ను కొంతవరకు కోల్పోయే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా సక్సెస్ తనకు చాలా కీలకంగా మారబోతుంది…