Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ టైంలో చాలా సిన్సియర్ గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు ఒక షాట్ అనుకుంటే ఆ షాట్ ని దర్శకుడు అనుకున్న టైంలో అనుకున్నట్టుగా తీయడానికి తన వంతు సహకారాన్ని అందిస్తూ ఉంటాడు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఇప్పుడు ఆయనకు అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కష్టమవుతుంది.
కానీ కెరియర్ మొదట్లో గాని జనసేన పార్టీ పెట్టే ముందు దాకా గాని ఆయన ఒక సినిమా షూటింగ్ లొకేషన్ లో ఆన్ టైమ్ కి ఉండి డైరెక్టర్లు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ తను బాగా నటించి మెప్పించేవాడు.ఇక అందులో భాగంగానే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బంగారం సినిమా మొదట కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమాలో నటించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ ముందే ఈ సినిమా వేస్ట్ సినిమా ప్లాప్ అయ్యేలా ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటే వాళ్లు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చిందట ఎందుకంటే ఒక దర్శకుడు, ఒక ప్రొడ్యూసర్ అంత బాగా సినిమాని నమ్మి చేసినప్పుడు ఈజీగా వేస్ట్ సినిమా అని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ అతని మీద కోపానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.
అది కూడా ఇండస్ట్రీలో ఉంటూ మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ తనతో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సీనియర్ నటుడు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలక్షన్స్ ఉండడం వల్ల సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్ బిజీలో తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెనువెంటనే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల పైన పవన్ కళ్యాణ్ తన పూర్తి డేట్స్ ని కేటాయించబోతున్నారని తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు…చూడాలి మరి వీటిలో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుంది అనేది…