Star Director: సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ(Sandeep Reddy Vanga)… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఆయన చేసిన మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా హీరోలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన స్పిరిట్(Spirit) పేరుతో ప్రభాస్ (Prabhas) తో ఒక భారీ రేంజ్ సినిమాని తెరకెక్కించే ప్రణాళికలైతే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్ తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే ఈయన చిరంజీవి హార్డ్ కోర్ అభిమాని అనే విషయం మనందరికి తెలుసు…

ఇక అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఈయన అభిమాని అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చేసిన ఖుషి సినిమా సమయంలో సేమ్ పోస్టర్ మీద ఉన్న ఒక ఫోటోను అనుకరిస్తూ అదే స్టిల్ లో సందీప్ కనిపిస్తూ ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…
ఆ సినిమా వచ్చినప్పుడు ఆయన టీనేజ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ ఫోటోని చూసిన ప్రతి ఒక్కరు ఈయన సందీప్ రెడ్డి వంగ నేనా లేదంటే మరి ఇంకెవరైనా అంటూ కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ఆయనను గుర్తుపట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి…
ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేసే ప్రతి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిస్తాడు అనే ఒక మార్క్ ఆయన మీద ఉన్నప్పటికి ఆయన సినిమాల్లో కంటెంట్ ఉంటుందని మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటు ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఇకమీదట ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…