Viatina-19 Cow
Viatina-19 Cow: ఆ ఆవు పేరు వియాటినా -19.. పేరు విని ఇదేదో విదేశాలకు చెందిన పశువు అనుకునేరు.. అది పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో… అది ఒంగోలు జాతి చెందిన ఆవు. పూర్వకాలంలో ఒంగోలు జాతి ఆవులు నెల్లూరు జిల్లాలోనూ సంచరించేవి. అయితే నేటికీ అవి కనిపిస్తున్నప్పటికీ.. ఒకప్పటిలాగా వాటి సంఖ్య లేదు. అయితే ఇక్కడ నెల్లూరు జిల్లాలోని ఒంగోలు జాతి ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి.. అక్కడి పశువులతో సక్రమణం చేయించారు. ఫలితంగా ఒంగోలు జాతిలోనే మరింత నాణ్యమైన పశువులను సృష్టించారు. అలా పుట్టిందే వియాటినా -19.. పైకి కృత్రిమ ప్రజననం లాగా కనిపిస్తున్నప్పటికీ.. వియాటినా లో పూర్తిగా ఒంగోలు జాతికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయి. వియాటినా -19 ఆవు బ్రెజిల్ లో జరిగిన వేల బాటలో 40 కోట్లకు అమ్ముడుపోయింది. బ్రెజిల్ లో జరిగిన వేలంపాటలో జపాన్ దేశానికి చెందిన వాగ్యు, మన దేశానికి చెందిన బ్రాహ్మణ్ అనే ఆవులు విపరీతమైన ధర పలుకుతా యనే విషయం విధితమే. అయితే బ్రెజిల్ దేశంలో ఇటీవల మీనాస్ గెరైస్ ప్రాంతంలో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా -19 ఆవు 4.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ ఆవు ఎలా ఉందంటే..
కృత్రిమ ప్రజననం ద్వారా వియాటినా -19 ను ఉత్పత్తి చేశారు. ఈ ఆవు అత్యధిక ధర పలకడంతో గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించింది.. కండరాల నిర్మాణం, జన్యువుల అమరిక వియాటినా -19 లో విభిన్నంగా ఉంది. అందువల్లే ఈ ఆవుకు ఛాంపియన్స్ ఆఫ్ ది మిస్ సౌత్ అమెరికా పురస్కారం లభించింది. ఈ ఆవు బరువు 1,101 కిలోలు.. ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. దీనికి ఉష్ణ మండల, రూప ఉష్ణ మండల ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ జాతి ఆవులు 1800 సంవత్సరంలోనే బ్రెజిల్ కు ఎగుమతి అయ్యాయని పశుసంవర్ధక శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆవుల్లో కండరాల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.. పైగా ఇవి ఎంత కష్టమైనా పనిచేస్తాయి. ఎంత బరువునైనా అవలీలగా లాగేస్తుంటాయి. పాలు కూడా సమృద్ధిగా ఇస్తుంటాయి. వీటి మాంసం కూడా అధిక రుచితో ఉంటుంది. ప్రోటీన్ విలువలు అధికంగా ఉంటాయి కాబట్టే పాశ్చాత్యులు దీని మాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. ఇక ఈ ఆవుల పాలు చాలా చిక్కగా ఉంటాయి. వాటిల్లో మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి. అందువల్లే ఈ ఆవులకు బహిరంగ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. బ్రెజిల్ దేశంలో గత కొంతకాలంగా ఈ ఆవుల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ఆవుల జన్యువుల ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త కొత్త జాతులను సృష్టిస్తున్నారు. 40 కోట్లకు వియాటినా -19 అమ్ముడుపోయిన నేపథ్యంలో బ్రెజిల్ మీడియా.. ఈ ఆవు గురించి ప్రత్యేకంగా కథనాలను ప్రసారం చేయడం విశేషం. ” ఆ ఆవు చాలా దృఢంగా ఉంది. అత్యంత బలంగా ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉంది. భూమ్మీదికి వచ్చిన తెల్లటి ధ్రువతార లాగా కనిపిస్తోంది. బహుశా లెక్క మిక్కిలి లీటర్ల కొలది పాలు ఇస్తుందేమోనని” బ్రెజిల్ మీడియా తను ప్రసారం చేసిన కథనాలలో పేర్కొంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Viatina 19 nellore breed cow in brazil 40 crore price a place in the guinness book
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com