Suresh Babu: తెలుగులో మంచి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ అప్పట్లో వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అందులో భాగంగా వాళ్ళ అన్నయ్య అయిన సురేష్ బాబు ఇండస్ట్రీ లో వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ ఉండటం వల్ల ఆయన ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని ఆ సినిమాని వెంకటేష్ తో చేయించి మంచి విజయాలను అందుకునేలా ప్రయత్నం చేశారు.
అందుకే వెంకటేష్ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు రీమేక్ సినిమాలే కావడం విశేషం… ఆయన చేసిన రీమేక్ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక గత రెండు మూడు సంవత్సరాల్లో వచ్చిన దృశ్యం 2, నారప్ప లాంటి సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం విశేషం… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టింది కూడా వెంకటేష్ అనే చెప్పాలి. ఇలా సురేష్ బాబు కి ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తీసుకొచ్చి వెంకటేష్ తో చేసి సక్సెస్ సాధించారు.
అలా వెంకటేష్ సక్సెస్ జర్నీలో సురేష్ బాబు పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. మొత్తానికైతే సక్సెస్ ఫుల్ సినిమాలను చేసి విక్టరీ వెంకటేష్ గా పేరు సంపాదించడమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. వెంకటేష్ అంటే యూనివర్సల్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ క్యారెక్టర్ అయిన ఈజీగా చేయగలడు అనే పేరు సంపాదించుకోవడంతో పాటు ప్రతి క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ కి అసలు హేటర్స్ ఉండరు. అందరి హీరోల ఫ్యాన్స్ వెంకటేష్ అంటే ఇష్టపడుతారు. ఎందుకంటే వెంకటేష్ కూడా ఏ ఈగో లు లేకుండా స్టార్ హీరోలందరి తో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి హీరో అభిమాని కూడా వెంకటేష్ కి అభిమాని అవుతాడు. అందుకే ఈయన సినిమాలు చూడడానికి ప్రతి హీరో అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు ఇక ఆ సినిమా బాగుంటే ఆ సినిమా బాగుందని మౌత్ టాక్ స్ప్రెడ్ చేసి చెప్తూ సినిమాని మిగతా వాళ్ళు చూడ్డానికి ఆ సినిమా కలక్షన్స్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు…