Mahesh Babu On Pawan Kalyan: మెగాస్టార్ తమ్ముడి గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకోవడమే కాకుండా పవర్ స్టార్ అనే బిరుదును కూడా చేజిక్కించుకున్నాడు. ఇక ఈయన చేసిన తొలిప్రేమ, ఖుషి లాంటి సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా నటుడిగా మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.
అయితే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో గా మారిన తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఇక దాంతో ఆ సినిమాకి సంబంధించిన పైరసీ వీడియోలు దొరకడంతో పైరసీ కి వ్యతిరేకంగా మహేష్ బాబు పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి మహేష్ బాబు చేసే పోరాటంలో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి తన మద్దతును తెలిపాడు. అలా మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చాలావరకు హెల్ప్ చేశాడనే చెప్పాలి. అలా వీళ్ళిద్దరూ పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో అప్పుడు కొద్ది వరకు పైరసీ తగ్గిందనే చెప్పాలి. ఇలా మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చేసిన హెల్ప్ వల్ల ఒక్కడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా కొంతవరకు పైరసీ నుంచి అరికట్టగలిగారు.
అలా అప్పుడు ఏ హీరో చేయలేని సాయం మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ చేశాడు. అందువల్ల వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ఇక అందులో భాగంగానే జల్సా సినిమాకి పవన్ కళ్యాణ్ అడగడంతోనే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక ఒక హీరో సినిమాకి ఇంకో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. మొత్తానికైతే వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.
అలాగే వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారనే చెప్పాలి ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు ఇక వీళ్లిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు.అయితే పవన్ కళ్యాణ్ ముందు గా ఇండస్ట్రీ కి వచ్చారు కాబట్టి ఆయన తీసుకున్న తర్వాత మహేష్ బాబు కూడా అక్కడే కోచింగ్ తీసుకోవడం విశేషం…