Prabhas: కృష్ణంరాజు నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ గా కూడా కొనసాగుతున్నాడు. ఇక ఇండియా లో ఆయనను మించిన హీరో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం..
అందులో భాగంగానే ఆయన ఇప్పుడు కల్కి, రాజసాబ్ అనే సినిమాలను చేస్తున్నాడు.ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన రాజమౌళి డైరెక్షన్ లో ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. అయితే ఎప్పుడు కూల్ గా కనిపించే మిస్టర్ పర్ఫెక్షనిస్టు కి షూటింగ్ స్పార్ట్ లో కోపం తెప్పించిన ఒక వ్యక్తి ఉన్నాడట.
ఆయన ఎవరు అంటే రాజమౌళి సినిమాలకు ఆస్థాన సినిమాటోగ్రాఫర్ గా ఉండే సెంథిల్ కుమార్.. ఛత్రపతి సినిమా సమయంలో సెంథిల్ ప్రభాస్ ను బాగా ఇరిటేట్ చేశాడట. ఎందుకు అనే విషయాన్ని ప్రభాస్ రాజమౌళి ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. అసలు విషయం ఏంటి అంటే సెంథిల్ రాజమౌళి కంటే పర్ఫెక్షనిస్ట్ అందుకే ఆర్టిస్టులు రెడీ అవుతున్నప్పుడు కూడా వెళ్లి మీటర్ తో చెక్ చేసుకుంటూ ఉంటాడు. అందువల్లే ఆయనని చూస్తే ఆర్టిస్టులు అందరూ కోపానికి వస్తారు.
ముఖ్యంగా ప్రభాస్ ఐతే చాలా ఇరిటేట్ అవుతూ ఉంటాడని ప్రభాస్ ని ఇమిటేట్ చేస్తూ మరి రాజమౌళి ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. నిజానికి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రభాస్ మూడుసార్లు వర్క్ చేసి మూడుసార్లు సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక నిజానికి సెంథిల్ కూడా చాలా మంచి పర్ఫెక్షనిస్ట్ అందువల్లే రాజమౌళితో ఇన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం రాజమౌళి ప్రభాస్ ముందే చాలా ఫన్నీగా ప్రభాస్ చెప్పిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది