https://oktelugu.com/

Sai Pallavi: తండేల్ మూవీ కోసం సాయి పల్లవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ పోతుంది…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు సక్సెస్ ఫుల్ నటులుగా పేరు సంపాదించుకోవాలంటే మాత్రం చాలా మంచి పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే వీళ్ళకి చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 3, 2024 / 01:13 PM IST

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య తో కలిసి తండేల్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో ఆమెది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావడంతో ఆమె అయితేనే సినిమాలో హీరోయిన్ గా బాగుంటుంది. అనే ఉద్దేశ్యం తో దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమా కోసం ఆమె దాదాపు 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని కూడా తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే సాయి పల్లవికి ప్రస్తుతం చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆమెను చూసే జనాలు థియేటర్ కి వస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాగచైతన్యకి ఉన్న క్రేజ్ కంటే సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ఎక్కువ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకుంది.

    ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడితే ఆమె మార్కెట్ మరింత భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో రన్బీర్ కపూర్ పక్కన ‘రామాయన్’ సినిమాలో సీతగా నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. తెలుగులో ఫిదా సినిమాతో తన కెరియర్ ని మొదలుపెట్టిన సాయి పల్లవి తెలుగులో ఆ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో అప్పటినుంచి ఆమె యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా కుర్రాళ్ల రాకుమారిగా కూడా మారిపోయిందనే చెప్పాలి.

    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనను తాను ప్రతి సినిమాలో కొత్త క్యారెక్టరైజేషన్ లో ప్రజెంట్ చేసుకుంటూ మెప్పిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఐతే సంపాదించుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి తో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తున్నప్పటికీ ఆమె మాత్రం సెలెక్టెడ్ క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకొని ముందుకు సాగుతుంది. ఆమె ఏ హీరోలతో అయిన కలిసి సినిమా చేయడానికి సిద్ధం గా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి.

    అలా ఉంటే తప్పకుండా ఆమె సినిమా చేస్తుంది. అలా కాకుండా స్టార్ హీరోతో సినిమా చేయాలి చిన్న క్యారెక్టర్ అని చెప్తే మాత్రం ఆమె సినిమా చేయదు. సినిమా ఏదైనా కూడా తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె నటిస్తుంది. లేకపోతే మాత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా నుంచి ఆఫర్ వచ్చిన కూడా ఆమె సున్నితంగా రిజెక్ట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…