Rashmika Mandanna Remuneration: హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్. నిజానికి ఆమెను పరాజయాలు వెంటాడుతున్నా.. ఆమె నటన పై విమర్శల సంగతెలా ఉన్నా.. తన కెరీర్ లో మాత్రం అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది రష్మిక. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 7 యేళ్లను పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ చేతి నిండా పెద్ద పెద్ద ఆఫర్లతో టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. సౌత్ లో ఫుల్ ఆఫర్లు ఉన్నా.. రష్మిక మందన్నా మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. రష్మిక మనసు అంతా బాలీవుడ్ మీదే ఉంది.

అయితే, రష్మిక మందన్నా కి అమితాబ్ సినిమాలో అలాగే మరో రెండు మీడియం రేంజ్ హిందీ సినిమాల్లో తప్ప.. పెద్దగా బాలీవుడ్ లో ఛాన్స్ లు వచ్చింది లేదు. మూతి కాలినా కుంపటే ముద్దు అన్నట్లు.. బాలీవుడ్ లో స్టార్ల సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. రష్మిక మందన్నా మాత్రం హిందీనే ముద్దు అంటుంది. అందుకే, హిందీలో చిన్నాచితకా సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలో హిందీ చిన్న నిర్మాతలు రష్మిక మందన్నా కోసం పోటీ పడుతున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ షాకింగ్ నిర్ణయం.. పాపం ఆ డైరెక్టర్ !!
దీనికి కారణం ఉంది. రష్మిక మందన్నా సినిమాలకు సౌత్ లో గిరాకీ ఉంటుంది. దాదాపు అందరి పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది కాబట్టి.. రష్మిక మందన్నా కంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ నే క్యాష్ చేసుకోవాలని కొందరు హిందీ నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయి పారితోషికం కూడా రష్మిక మందన్నా కు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రష్మిక మందన్నా సౌత్ లో ఒక సినిమాకు పొందే పారితోషికం 2 కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. బాలీవుడ్ లో మాత్రం 4 నుంచి 5 కోట్లు అందుకుంటుంది.

ఏది ఏమైనా రష్మిక మందన్నా ఇలా రికార్డు స్థాయి పారితోషికం పుచ్చుకోవడం విశేషమే. పైగా అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను పూర్తి చేసిన పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా రష్మిక మందన్నా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో ఎక్కువ పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా నటించడం అంటే మాటలేమీ కాదు! కానీ, రష్మిక మందన్నా మాత్రం ఆ ఫీట్ ను అవలీలగా సాధించింది. మొత్తానికి నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా రష్మిక మందన్నా కెరీర్ సాగిపోతుంది.