Rajinikanth’ Remuneration: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఈయనకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఆయన నటించిన లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్ లలో విడుదల కావాడానికి సిద్ధమవుతోంది. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించారట.
ఈ సినిమాలో రజనీకాంత్ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తారని తెలుస్తోంది. కానీ ఈ అరగంట సీన్స్ కోసం ఈ స్టార్ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ అనే పాత్రలో నటించారు రజనీ. అయితే 30 నిమిషాల తన పాత్ర కోసం ఏకంగా రూ. 40 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నారట భాషా.
కేవలం అరగంట నిడివి ఉన్న పాత్ర కోసం ఏకంగా రూ. 40 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకోవడం గ్రేట్. ఇలా ఏ హీరో కూడా ఇప్పటి వరకు అందుకోలేదు కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సూపర్ స్టార్ త్వరలోనే క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించబోతున్నారని చిత్ర పరిశ్రమలో టాక్. ఇప్పటికే సినిమా సినిమాకు సూపర్ స్టార్ రేంజ్ పెరుగుతుంది. మరిన్ని సినిమాలతో రాబోతున్నారని తెలిసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏడు పదుల వయస్సులో సైతం వరుసగా సినిమాల్లో నటిస్తూ విజయాలను సొంతం చేసుకోవడం ఈ స్టార్ కు మాత్రమే సాధ్యం అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు త్వరలో ఈయన హీరోగా రాబోతున్న సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లే అవడం గమనార్హం. మరి రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేస్తారో చూడాలి.