Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవ్వడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటో తెలుసా..?

రీసెంట్ గా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నప్పటికీ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అనేలా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

Written By: Gopi, Updated On : March 19, 2024 10:38 am

Pawan Kalyan role in introducing Varun Tej as a hero

Follow us on

Varun Tej: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి క్రేజ్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజన్ మంది హీరోలు ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే… అయితే నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తన మొదటి సినిమా అయిన ‘ముకుంద ‘ మూవీ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరైతే సంపాదించుకున్నాడు.

ఇక రీసెంట్ గా వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్నప్పటికీ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అనేలా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే వరుణ్ తేజ్ సినిమాల్లోకి వస్తానని మొదట పవన్ కళ్యాణ్ తో చెప్పారట. దాంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దగ్గరుండి మరి తనకి యాక్టింగ్, డాన్సులలో శిక్షణ ఇప్పించాడట. ఇక అవన్నీ పూర్తయిన తర్వాత వరుణ్ ను హీరోగా లాంచ్ చేద్దాం అనుకున్న టైం లో ఒకరోజు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పారట. ఆ కథ బాగానే ఉంది కానీ మనం ఈ సినిమా తర్వాత చేద్దాం..

ప్రస్తుతానికి వరుణ్ తేజ్ ను మీ చేతుల మీదుగా లాంచ్ చేయండి అని చెప్పారట. దాంతో శ్రీకాంత్ అడ్డాల పవన్ కళ్యాణ్ అడిగిన తర్వాత కాదనలేకపోయి ముకుంద సినిమాతో వరుణ్ తేజ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ నటుడిగా వరుణ్ తేజ్ కైతే మంచి మార్కులే పడ్డాయి.

ఇక ఆ తర్వాత నుంచి వరుణ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా వరుణ్ తేజ్ హీరో అవడానికి పవన్ కళ్యాణ్ కీలకపాత్ర వహించడనే విషయం చాలామందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా కెరియర్ అనేది ఇంత సాఫీగా సాగి ఉండేది కాదని చాలామంది మెగా అభిమానులు చెబుతూ ఉంటారు…