Homeఎంటర్టైన్మెంట్Naresh - Pavitra Lokesh: నరేష్ తో సహజీవన తర్వాత రేటు పెంచిన పవిత్రా లోకేష్.....

Naresh – Pavitra Lokesh: నరేష్ తో సహజీవన తర్వాత రేటు పెంచిన పవిత్రా లోకేష్.. ఎంతో తెలుసా?

Naresh – Pavitra Lokesh: పవిత్ర లోకేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సినిమా పరిశ్రమలో పవిత్ర నరేష్ ల సంబంధం వైరల్ గా మారింది. వారిద్దరు కలిసి సహజీవనం చేయడం సంచలనంగా మారింది. దీంతో పవిత్ర లోకేష్ పేరు ఇప్పుడు పరిశ్రమలో ప్రచారంలో ఉన్న పేరు. అందరి నోట వినిపించే పేరు. దీంతో ఆమెకు సహజంగా ప్రచారం అవసరం లేదు. సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తున్నా నిజజీవితంలో భార్య పాత్రలో చక్కగా జీవిస్తోంది. దీంతో వారి బంధం కాస్త అందరికి తెలిసిపోవడంతో రచ్చ రచ్చ అవుతోంది.

Naresh - Pavitra Lokesh
Naresh, Pavitra Lokesh

తాజాగా పవిత్ర లోకేష్ తన పారితోషికం పెంచేశారు. గతంలో రోజుకు రూ.60 వేల వరకు తీసుకున్న ఆమె ప్రస్తుతం రూ. లక్షకు పెంచేసింది. దీంతో ఆమెకు వచ్చిన ప్రచారంతోనే ఆమె రేటు పెంచినట్లు తెలుస్తోంది. నరేష్ తో ఉన్న సంబంధం కారణంగా ఆమెకు అవకాశాలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ ఇలా రెమ్యునరేషన్ పెంచితే అవకాశాలు తగ్గుతాయేమోననే సందేహాలు కూడా వస్తున్నాయి. తల్లి పాత్రల్లో ఒదిగి నటించే ఆమెకు వరుస అవకాశాలు రావడంతోనే పారితోషికం పెంచేసినట్లు సమాచారం.

ఇటీవల విడుదలైన రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ తల్లిగా నటించింది. ఇందులో నరేష్ కూడా ఓ క్యారెక్టర్ చేశారు. వీరిద్దరు కలిసి నటించే సన్నివేశంలో ప్రేక్షకులు ఈలలు, గోలలు వేయడంతో థియేటర్ అంతా సందడి నెలకొంది దీంతో వీరిద్దరి బంధం గురించి సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనంగా చెప్పుకుంటున్నారు. భవిష్యత్ లో ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాత్రల్లో నటించే ఆమె నరేష్ తో సహజీవనం చేస్తుండటంతో నరేష్ మూడో భార్యకు నచ్చడం లేదు. దీంతో వారిని హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీయడంతో వారి సంబంధం వైరల్ గా మారింది.

Naresh - Pavitra Lokesh
Pavitra Lokesh

స్టార్ హీరోలందరికి తల్లిపాత్రలో నటించి మెప్పించారు. సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ తల్లిగా నటించింది. దువ్వాడ జగన్నాథంలో కూడా తల్లి పాత్ర చేసి ప్రశంసలు అందుకుంది. జైలవకుశ, సర్కారు వారి పాట లాంటి సినిమాల్లో కూడా తల్లి పాత్రల్లోనే ఒదిగిపోయింది. సహజంగా కన్నడ నటి అయినా తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకోవడం విశేషం. కానీ నరేష్ తో ఉన్న సంబంధం వల్ల భవిష్యత్ లో ఆమెకు అవకాశాలు తగ్గుతాయనే వదంతులు కూడా వస్తున్నాయి. కానీ ఏం జరుగుతుందో చూడాలి మరి.

హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్ | Actress Poorna Marriage Cancelled | Oktelugu Entertainment
అన్న కోసం రౌడీ షీటర్ ని చితకబాదిన పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Crushed Rowdy Sheeter For Chiranjeevi
ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూస్తున్నారు | Nikhil Emotional Words On Karthikeya 2 Movie | Nikhil

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version