Naga Chaitanya
Naga Chaitanya: టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. నాగేశ్వరరావు, నాగార్జున తరువాత నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగ చైతన్య కూడా తన నటనతో ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకున్నారు.
నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నాగ చైతన్య నటిస్తుండగా ఆయన సరసన సాయిపల్లవి కథనాయకగా నటిస్తున్నారు. మరోవైపు ‘ధూత’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టారు. జర్నలిస్ట్ గా నాగచైతన్య మరోసారి అభిమానులను మంత్ర ముగ్ధులను చేశారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
నాగ చైతన్య నటనా పరంగా గుర్తింపుతో పాటు ఆస్తులను కూడా భారీగానే సంపాదించుకున్నారని తెలుస్తోంది. సొంత క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయును ప్రారంభించిన నాగ చైతన్య ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. హైదరాబాదీలకు పాన్ ఆసియన్ వంటకాలను అందిస్తూ వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఇయన ఒకరు కావడం విశేషం. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. దాంతో పాటు బ్రాండ్ ఎండార్సర్ గా పని చేసే ఆయన ఒక్కో ఎండార్స్ మెంట్ కు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అలాగే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఒక విలాసవంతమైన బంగ్లాను సైతం కొనుగోలు చేశారు. మరోవైపు ఆయన కార్లు, బైక్స్ ను చాలా ఇష్టపడుతారు. ఇప్పటికే చైతూ దగ్గర రూ.1.75 కోట్ల విలువైన ఫెరారీ ఎఫ్ 430, రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఉన్నాయి. దాంతో పాటు రూ.19 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఆర్9టీ, ట్రయంఫ్ థ్రక్స్ టన్ ఆర్ వంటి సూపర్ బైకులు కూడా ఉన్నాయి.