Mahesh Babu Remuneration: టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ సినిమాలంటే మాంచి క్రేజ్. ఒకప్పుడు ఈయన సినిమాలంటే ఓన్లీ కామెడీ ఫిలింస్ అనే పేరు ఉండేది. కానీ యంగ్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ‘అరవింద సమేత’ తీసిన తరువాత ఈయన మాస్ డైరెక్టర్ అనిపించుకుంటున్నాడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ‘గుంటూరు కారం’ తీసిన విషయం తెలిసిందే. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. వరుస హిట్లు కొడుతున్న సూపర్ స్టార్ కు ఈ సినిమా కూడా సక్సెస్ తెస్తుందని అంటున్నారు. ఈ తరుణంలో మహేష్ బాబు ఈ మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో.. అన్న చర్చ విపరీతంగా సాగుతోంది. కానీ ఈ విషయంలో మహేష్ ఓ సాహసం చేశాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ప్రారంభం నుంచి లుక్స్, గ్లింప్స్ అదిరిపోవడంతో దీని కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల కింద రిలీజ్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ అనే సాంగ్ ద్వారా మరింత హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇందులో మహేష్ ఫుల్ టైం మాస్ హీరోగా కనిపించనున్నాడు.
అయితే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టు నుంచి సీనియర్ హీరో స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ తరుణంలో ఆయన రెమ్యూనరేషన్ బాగానే ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ ‘గుంటూరు కారం’ సినిమా కోసం మహేష్ తీసుకున్నది కేవలం రూ.50 కోట్లు అని తెలుస్తోంది. వాస్తవంగా ఇతరుల సినిమా కోసం అయితే రూ. 70 ఆపై వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తక్కువ రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకున్నాడు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సినీ హీరోగానే కాకుండా ఇతర బిజినెస్ లో రాణిస్తున్న మహేష్ డబ్బు విషయాన్ని పెద్దగా పట్టించుకోరని, అందుకే తనకు గురువుగా భావిస్తున్న త్రివిక్రమ్ సినిమాకు తక్కువ రెమ్యూరేషన్ తీసుకున్నాడని కొందరు అంటున్నారు. అయితే త్రివిక్రమ్ సొంత బ్యానర్ పై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అందుకే తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారని అంటున్నారు. ఏదీ ఏమై త్రివిక్రమ్ కోసం మహేష్ ఇంత పెద్ద సాహసం చేయడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.