https://oktelugu.com/

కార్తీక దీపం డాక్టర్ బాబు పారితోషికం ఎంతో తెలుసా?

తెలుగు సీరియ‌ల్‌ రంగంలో నిరుప‌మ్ అంటే చాలా మందికి తెలియ‌దు. కానీ.. డాక్ట‌ర్ బాబు అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ చెప్పేస్తారు. ఇది చాలు.. నిరుప‌మ్ అలియాస్ డాక్ట‌ర్ బాబు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా ద‌గ్గ‌ర‌య్యాడో చెప్ప‌డానికి! కార్తీక దీపం సీరియ‌ల్ తో నిరుప‌మ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు సీరియ‌ల్స్ లో ఇప్పుడున్న న‌టుల్లో ఎవ్వ‌రికీ ద‌క్క‌నంత క్రేజ్ ను సంపాదించుకున్నాడ‌ని చెప్పొచ్చు. మ‌రి, ఇంత ఫేమ‌స్ అయిన నిరుప‌మ్ సీరియ‌ల్ కు రెమ్యున‌రేష‌న్ […]

Written By:
  • Rocky
  • , Updated On : July 18, 2021 / 09:25 AM IST
    Follow us on

    తెలుగు సీరియ‌ల్‌ రంగంలో నిరుప‌మ్ అంటే చాలా మందికి తెలియ‌దు. కానీ.. డాక్ట‌ర్ బాబు అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ చెప్పేస్తారు. ఇది చాలు.. నిరుప‌మ్ అలియాస్ డాక్ట‌ర్ బాబు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా ద‌గ్గ‌ర‌య్యాడో చెప్ప‌డానికి! కార్తీక దీపం సీరియ‌ల్ తో నిరుప‌మ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు సీరియ‌ల్స్ లో ఇప్పుడున్న న‌టుల్లో ఎవ్వ‌రికీ ద‌క్క‌నంత క్రేజ్ ను సంపాదించుకున్నాడ‌ని చెప్పొచ్చు. మ‌రి, ఇంత ఫేమ‌స్ అయిన నిరుప‌మ్ సీరియ‌ల్ కు రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటాడు? అత‌ని ఆస్తులు ఎంత‌? అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్‌. ఆ వివ‌రాలు మీకోసం…

    నిజానికి డాక్ట‌ర్ బాబు సీరియ‌ల్ న‌టుడు కాదు.. సినిమా న‌టుడు కావాల‌ని అనుకున్నాడు. ఈ నిరుప‌మ్ ఎవ‌రో కాదు.. సీనియ‌ర్ న‌టుడు, రైట‌ర్ ఓంకార్ కుమారుడు. దీంతో.. తండ్రి ప‌రిచ‌యాల‌తో సినిమాల్లో చాన్స్ కోసం బాగానే ప్ర‌య‌త్నించాడు. అప్ప‌ట్లో నాని హీరోగా వ‌చ్చిన ‘అష్టా-చ‌మ్మా’ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే సీరియ‌ల్స్ లోకి వ‌చ్చాడు. ఈ టెస్టులో అద్భుతంగా హిట్ట‌య్యాడు నిరుప‌మ్‌.

    ఒక్కో సీరియ‌ల్ అంటూ మెట్టు మీద మెట్టు ఎక్కుతూ వ‌చ్చేశాడు. ప్ర‌స్తుతం ఎన్ని సీరియ‌ల్స్ లో న‌టిస్తున్నప్ప‌టికీ.. అత‌ను ఎక్కువ‌గా క్రేజ్ అందుకుంటున్న‌ది మాత్రం కార్తీక దీపం సీరియ‌ల్ తోనే. ఇప్ప‌టికే వెయ్యి ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ సీరియ‌ల్.. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఏ ఇంట్లో ఎన్ని సీరియ‌ళ్లు చూసినా కానీ.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది చూసే ఏకైక సీరియ‌ల్ గా కార్తీక దీపం నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు.

    మ‌రి, ఇంత క్రేజ్ తెచ్చుకున్న డాక్ట‌ర్ బాబు రెమ్యున‌రేష‌న్ ఎంత అనేది అంద‌రికీ ఆస‌క్తిని క‌లిగించే అంశం. ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఒక రోజు షూటింగ్ కు 25 వేల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. సీరియ‌ళ్ల‌కు డే టూ డే పేమెంట్ ఉంటుంది. అత‌ని చేతిలో ఇప్పుడు మ‌రో రెండు సీరియ‌ల్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్న రోజుకు 75 వేల రూపాయలు అందుకుంటున్నట్టు సమాచారం. అంటే.. నెలకు 22 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు అంచనా.

    ఇక‌, నిరుప‌మ్ స‌తీమ‌ణి మంజుల సైతం సీరియ‌ళ్ల‌లోనే న‌టిస్తున్నారు. ఆమె కూడా బాగానే సంపాదిస్తోంది. ఈ విధంగా చూసుకున్న‌ప్పుడు డాక్ట‌రు బాబు రాబ‌డి ఘ‌నంగా ఉంద‌ని చెప్పొచ్చు. ఇక‌, ఆయ‌న ఆస్తుల గురించి చూస్తే.. వైజాగ్ లో రూ.5 కోట్లు విలువ చేస్తే ప్రాప‌ర్టీ, హైద‌రాబాద్ లో రూ.80 ల‌క్ష‌లు విలువ చేసే ప్లాట్‌, ఖ‌రీదైన రెండు కార్లు ఉన్నాయి. వీటితోపాటు ఇంకా ప‌లు ఆస్తులు కూడా ఉన్నాయి. మొత్తంగా.. ఇటు సీరియ‌ల్స్ లో దుమ్ములేపోతున్న డాక్ట‌ర్ బాబు.. అటు రెమ్యున‌రేష‌న్ సైతం గ‌ట్టిగానే రాబ‌డుతున్నాడని చెప్పొచ్చు.