Kamal Haasan Remuneration: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న లెజెండ్స్ లో ఒకరు కమల్ హాసన్..ఈయన చేసినన్ని పాత్రలు..చేసినన్ని గొప్ప సినిమాలు బహుశా ఇండియా లో ఏ హీరో కూడా చేసి ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..నటన పరంగా ఆయన ఒక నిఘంటువు లాంటి వాడనే చెప్పాలి..ఇటీవలే ఆయన విక్రమ్ సినిమా తో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..సుమారు 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం సౌత్ ఇండియా లోనే ఆల్ టైం టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలవగా..తమిళనాడు లో ఆల్ టైం ఇండస్ట్రీ గా నిలిచింది..౭౦ ఏళ్ళ వయస్సు కి దగ్గర పడుతున్నా కూడా ఈ తరం సూపర్ స్టార్స్ ని అధిగమించి ఈ స్థాయి రికార్డు పెట్టడం అంటే మాములు విషయం కాదు..విక్రమ్ సినిమాకి ముందు కమల్ హాసన్ గారికి సరైన హిట్ లేదు..ఇక ఆయన పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో విక్రమ్ సినిమా తో తన స్టార్ స్టేటస్ ఎలాంటిదో మరోసారి అందరికి తెలిసేలా చేసాడు.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన శంకర్ గారి దర్శకత్వం లో ఇండియన్ 2 అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..చాలా కాలం నుండి కొన్ని అనుకోని సంఘటనల వల్ల తాత్కాలికంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, ఇటీవలే మళ్ళీ తిరిగి ప్రారంబించుకుంది..అయితే ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండియా లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది.
Also Read: Pooja Hegde: టాప్ ఉన్నా లేనట్లే.. హాట్ సెల్ఫీతో సోషల్ మీడియాను షేక్ చేసిన బుట్టబొమ్మ పూజా!
ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 150 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం..విక్రమ్ సినిమాకి ముందు కమల్ హాసన్ గారి రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి 40 నుండి 50 కోట్ల రూపాయిల వరుకు ఉండేది..విక్రమ్ సినిమా తర్వాత ఆయన రేంజ్ అమాంతం 110 కోట్ల రూపాయలకు ఎగబాకింది.

నిర్మాతలు కూడా కమల్ హాసన్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించట్లేదు..అప్పట్లో ఇండియన్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తెలుగు లో భారతీయుడు అనే పేరు తో విడుదలైంది..ఇక్కడ కూడా సెన్సషనల్ హిట్..అలాంటి హిట్ కి సీక్వెల్ అవ్వడం తో ఈ భారతీయుడు 2 పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అప్పటి లాగానే ఇప్పుడు కూడా ఈ సినిమా సీక్వెల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపుతుందో లేదో చూడాలి.
[…] […]