Chiranjeevi- Siddhartha Jonnalagadda: రీసెంట్ సమయం లో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న యంగ్ హీరోలలో ఒకడు సిద్దు జొన్నలగడ్డ. ఇతను ఇండస్ట్రీ లో చాలా కాలం నుండే ఉన్నాడు. కానీ మంచి పేరు తెచ్చుకుంది గత ఏడాది విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమాతోనే. ఈ చిత్రం కమర్షియల్ గా అతనికి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా , యూత్ లో మంచి క్రేజ్ ని కూడా తెచ్చిపెట్టింది. అంతకు ముందు కూడా ఆయన ‘గుంటూరు టాకీస్’ వంటి సూపర్ హిట్ సినిమాలో హీరో గా నటించాడు కానీ, ఆయనకీ పేరు ప్రతిష్టలు మాత్రం రాలేదు.
ఆ తర్వాత లాక్ డౌన్ సమయం లో దగ్గుపాటి రానా నిర్మించిన ‘కృష్ణ & హిస్ లీల’ సినిమా తో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మనోడు కేవలం హీరో మాత్రమే కాదు, డైరెక్టర్ మరియు స్క్రిప్ట్ రైటర్ కూడా.’డీజీ టిల్లు’ మరియు ఇప్పుడు దానికి చేస్తున్న సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలకు కూడా స్క్రిప్ట్ మరియు మాటలు అందించింది ఈయనే.
ఇంత గొప్ప టాలెంట్ ఉన్న కుర్రాడు షైన్ అవ్వడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే లేట్ గా పాపులర్ అయినా కూడా, డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ ని అందుకున్నాడు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా విడుదల అయితే థియేటర్స్ కి క్యూలు కట్టే రేంజ్ వచ్చేసింది. అందుకే ఈయన రెమ్యూనరేషన్ బాగా పెంచేసాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి ఏకంగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు.
ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరియు వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమా లో నటించేందుకు గాను ఆయన నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తున్నాడట. అసలు డబ్బులే తీసుకోకుండా కెమెరా ముందు కనిపిస్తే చాలు అని నటించిన రోజుల నుండి, ఇప్పుడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఆయన ఎదిగిన తీరు ప్రశంసనీయం.