Krishnam Raju Facilitates Maid: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. రెబల్ స్టార్ నిజ జీవితంలో కూడా అలాగే ప్రవర్తించేవారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు నిలవడం గమనార్హం. వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి పద్మ గత ఇరవై ఐదు ఏళ్లుగా వారి ఇంట్లోనే పని చేస్తుందంటే ఆమెను ఎంత బాగా చూసుకుంటారో అర్థమవుతోంది. కృష్ణం రాజు ఇంట్లో ఆమె ఓ కుటుంబ సభ్యురాలిగా కావడం గమనార్హం.

కృష్ణం రాజుకు పెళ్లి కాక ముందే వారి ఇంట్లో పని మనిషిగా చేరిన పద్మ ఇప్పటికి కూడా వారి ఇంట్లోనే పని చేస్తుంది. ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి ఇంట్లో ఆమెకు ఘనమైన సత్కారం కూడా చేశారు. వారి ఇంట్లో ఒక సభ్యురాలిగా ఆమె మారిపోయింది. వారి ఆలనాపాలనా చూసుకునే వ్యక్తిగా ఆమె అంటే వారందరికి ఇష్టమే. వారి పిల్లలు కూడా ఆమె చేతులోనే పెరిగారు. పనిమనిషి పద్మ పాతికేళ్లుగా వారి ఇంట్లో పని చేస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది.
కృష్ణంరాజ, శ్యామల దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. అయినా వారి గురించి ఎక్కువగా పట్టించుకునేది పద్మ. దీంతో ఆమె చెప్పింది ఎవరు కూడా కాదనేవారు కాదు. ఓసారి పద్మ ఇంటికి వెళ్తుండగా చైన్ స్నాచింగ్ ముఠా వెంబడించి చైన్ లాక్కొని పారిపోతుండగా వారిని వెంబడించి తరిమితరిమి కొట్టింది. దీంతో జనం పోగై వారికి దేహశుద్ధి చేశారు. ఆమె ధైర్యానికి అందరు ఫిదా అయ్యారు. రెబల్ స్టార్ లో ఉన్న ధైర్యం ఆమెకు కూడా వచ్చేసిందని పలువురు చెబుతుంటారు.

ఇక కృష్ణం రాజుకు సంబంధించిన పని ఏదైనా సరే పద్మ చూసుకుంటూ దాన్ని త్వరగా ముగించేందుకు అందరికి సూచనలు చేసేది. దీంతో వారు పద్మ ఉందంటే చాలు భయపడుతుంటారు. ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సన్మానించి ఆమెకు ప్రత్యేకమైన బహుమతి కూడా అందజేశారు. దీంతో వారి మంచి మనసుకు ఆమె ఎప్పుడు కూడా తన సొంతం అని చూసుకోకుండా వారి కోసమే జీవితాన్ని ధార పోసింది. ఇలా వారి కుటుంబంలో ఒకరిగా మిగిలిపోయింది. ఆమెకు భర్త కూతురు ఉన్నా ఎక్కువ సమయం రెబల్ స్టార్ ఇంట్లోనే పనిచేసుకుంటూ ఉండటమే ఆమె ప్రత్యేకత.