Venky Movie: అభిమానులు, ప్రేక్షకులు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటిని కల్ట్ క్లాసిక్ సినిమాలు అని అందరూ అంటూ ఉంటారు. మనకి బోర్ కొట్టినప్పుడల్లా ఈ సినిమాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాము. అలాంటి సినిమాలలో ఒకటి వెంకీ. మాస్ మహారాజ రవితేజ మరియు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
రవి తేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో బ్రహ్మానందం, ఏవీఎస్ వంటి కమెడియన్స్ పండించిన కామెడీ వల్ల ఈ చిత్రానికి ఈరోజు కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధానంగా వచ్చే ట్రైన్ సన్నివేశం మన అందరికీ పొట్ట చెక్కలు అయ్యే రేంజ్ లో నవ్వు రప్పించింది. మళ్ళీ ఈ సన్నివేశాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు రీ క్రియేట్ చేయాలనుకున్నారు కానీ వారి వల్ల కాలేదు.

అయితే ఈ చిత్రం లో ప్యాసెంజర్ గా ఒక అమ్మాయి అద్దాలు పెట్టుకొని కనిపిస్తుంది, ఇది మీరంతా గమనించే ఉంటారు. ఈ అమ్మాయి మీద రవితేజ పంచులు కూడా బాగా విసురుతాడు. అయితే హీరోయిన్,హీరోయిన్ నాన్నని చంపబోయి విలన్స్ ఈమెని, హీరోయిన్ నాన్నని చంపేస్తారు. అప్పుడు ట్రైన్ లో ఉన్నవాళ్లు మొత్తం వెంకీ గ్యాంగ్ చేసారు అనుకోవడం,వాళ్ళు తమని తాము నిర్దోషులం అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చెయ్యడం,ఇవన్నీ మనకి తెలిసిందే ,ఎన్నోసార్లు చూసి ఉంటాము.
అయితే ట్రైన్ లో సోడా బుడ్డి అద్దాలు పెట్టుకున్న ఆ అమ్మాయి పేరు అపర్ణ. ట్రైన్ లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం శ్రీను వైట్ల ప్రత్యేకంగా ఆడిషన్స్ చేసి ఈమెని ఎంచుకున్నారు. ఈమె ఈ ఒక్క సినిమాలోనే నటించింది, ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించలేదు. ప్రస్తుతం ఈమె అమెరికా లో నివసిస్తున్నట్టు సమాచారం. ఆమె లేటెస్ట్ ఫోటోని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాం చూడండి.