https://oktelugu.com/

Pokiri Movie: ‘పోకిరి’లోని ఈ హాట్ భామ ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?

పోకిరి మూవీలో మహేష్ బాబు, ఇలియానాతో పాటు గ్యాంగ్ స్టర్ లో మోనా పాత్రలో ఉన్న ఓ హాట్ బ్యూటీ అందరినీ ఆకర్షించింది. తన అందచందాలతో క్రష్ గా కనిపించి ప్రత్యేకంగా నిలిచింది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 12, 2023 / 11:44 AM IST

    Pokiri Movie

    Follow us on

    Pokiri Movie: సూపర్ స్టార్ మహేష్ బాబను రెండో సారి కెరీర్ మలుపు తిప్పిన మూవీ ‘పోకిరి’. అప్పటి వరకు ఈ క్యూట్ హీరో సాఫ్ట్ పాత్రలేచేస్తూ వచ్చారు. పోకిరితో ఒక్కసారిగా మాస్ హీరోగా మారిపోయాడు. మహేష్ అప్పటి నుంచి మాస్ చిత్రాలు తీస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. పోకిరి మూవీ మహేష్ కు మాత్రమే కాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు హీరోయిన్ ఇలియనాతో పాటు ఇందులో నటించిన వారూ ఫేమస్ అయ్యారు. తాజాగా ఈ మూవీలో నటించిన ఓ హాట్ భామ గురించి ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

    పోకిరి మూవీలో మహేష్ బాబు, ఇలియానాతో పాటు గ్యాంగ్ స్టర్ లో మోనా పాత్రలో ఉన్న ఓ హాట్ బ్యూటీ అందరినీ ఆకర్షించింది. తన అందచందాలతో క్రష్ గా కనిపించి ప్రత్యేకంగా నిలిచింది. ఈ భామ ఎవరా? అని అప్పట్లో తెగ చర్చ పెట్టారు. మోనా అసలు పేరు జ్యోతిరావు. డేరింగ్ డాషింగ్ క్యారెక్టర్ లో ఓ అమ్మాయి కావాలని పూరి జగన్నాథ్ ఎదురుచూస్తున్నప్పుడు ఈమె కనిపించింది. ఆమెకు క్యారెక్టర్ చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది.

    సాధారణ పాత్రలో కనిపిస్తే జ్యోతిరావుకు పెద్దగా గుర్తింపు ఉండేది కాకపోవచ్చు. గ్యాంగ్ స్టర్ లేడీగా ఆమె నటించడంతో అందరి దృష్టి ఆమె పై పడింది. అయితే ఆమెకు స్పెషల్ ఇమేజ్ వచ్చింది కానీ.. స్టార్ కాలేకపోయింది. కానీ ఈ సినిమా తరువాత మరోసారి పూరి డైరెక్షన్లో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’.. ఆ తరువాత హోమం అనే సినిమాల్లో నటించారు. జ్యోతిరావు చేసిన ఈ మూడు సినిమాలు మాస్ తో కూడుకున్నవే.

    ఆ సినిమాల తరువాత పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అయితే చాన్నాళ్ల తరువాత ఇటీవల జ్యోతిరావు ‘గ్రంథాలయం’ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ జ్యోతిరావు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తన హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన గ్లామరస్ పిక్స్ మతిపొగోట్టేస్తుంది. దీంతో జ్యోతిరావు గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.