Businessman Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా మహేష్ కు సంబంధించిన ‘బిజినెన్ మేన్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఓపెనింగ్స్ రూ.1.36 కోట్లు వసూలయ్యాయి. రీ రిలీజ్ మూవీకి ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం చూసి ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఇక మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్నా బిజినెస్ మూవీ గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఇందులో నటించిన హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఉన్న అమ్మాయి గురించి చాలా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముద్దుముద్దుగా సగం తెలుగు మాట్లుడుతూ ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు.
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఆర్ఆర్ మూవీ పతాకంపై నిర్మించిన బిజినెస్ మేన్ 2012 జనవరి 13న రిలీజ్ అయింది. రాజకీయాలు పక్కా కమర్షియల్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టుతో వచ్చిన ఈ మూవీ అప్పట్లో కమర్షియల్ గా బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. అప్పటికే మహేష్, పూరిజగన్నాథ్ కాంబినేషన్లో వచ్చి ‘పోకిరి’ బ్లాక్ బస్టర్ తరువాత ఈ మూవీ రిలీజ్ కావడంతో ఇది కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మహేష్ బాబు ఆల్ టైం మాస్ హీరో అనిపించుకున్నాడు.
ఈ సినిమాలో కాజల్ కాస్త హాట్ కానే కనిపిస్తుంది. ఓ పోలీస్ ఆఫీసర్ కూతురిగా కనిపించే కాజల్ కు ఓ స్నేహితురాలు ఉంటుంది. అమె అచ్చం ఇంగ్లీష్ అమ్మాయిలా ఉన్న ఈమె ఇండియన్ గర్లే. కానీ భారత సంతతికి చెందిన కెనడాలో పెరిగింది. ఆమె పేరు అయేషా శివ. ఈమె నటి మాత్రమే కాకుండా ప్రోడ్యూసర్ కూడా. కెనడాలో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ తరువాత హిందీ సినిమాల్లో యాక్టింగ్ చేసింది. అయితే బిజినెస్ మెన్ సినిమాతోనే అయేషాకు గుర్తింపు వచ్చింది.
వరుణ్ సందేశ్, సుశాంత్ కలిసి నటించే ఓ సినిమాలో అయేషా నటిస్తుందని సమాచారం. పెళ్లయి భర్తతో కలిసి ఉంటున్న అయేషా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె లేటేస్ట్ పిక్స్ ను ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫొటోలను చూసి మహేష్ ఫ్యాన్స్ షాక్ అవుతారు. అయితే ఇప్పుడు బిజినెస్ మెన్ సినిమా రిలీజ్ సందర్భంగా అయేషా శివ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram