Heroine Samiksha: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాథ్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. లవ్, ఎమోషనల్, యాక్షన్ తో పాటు రొమాన్స్ ను కూడా పండిస్తాడు. ఈ తరుణంలో ఆయన హీరోయిన్లను సెలెక్ట్ చేయడంలో చాలా కేర్ తీసుకుంటారు. పూరి పరిచయం చేసిన చాలా మంది హీరోయిన్లు ఆ తరువాత స్టార్లుగా కొనసాగారు. ఆయన కెరీర్లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ ‘143’. తన తమ్ముడు సాయిరాంను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ సినిమాలో హీరోయిన్ గా సమీక్షను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో సమీక్ష చాలా చక్కగా నటించారు. సాయిరాంను ప్రేమించే అమ్మాయిగా కనిపించి యూత్ ను బాగా కట్టుకుంది. మరి ఆ ముద్దుగుమ్మ ఇప్పుడెలా మారిపోయిందో చూడండి..
పంజాబ్ రాష్ట్రానికి చెందిన సమీక్ష 1985 అక్టోబర్ 8న చండీఘర్ లో జన్మించారు. పూరిజగన్నాథ్ ‘143’ సినిమాలో హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సమీక్షను చూడగానే తన సినిమాకు సరైన నటి అని ఆమెను సెలెక్ట్ చేశారు. ఈ మూవీ యావరేజ్ హిట్టు కొట్టినా సమీక్షకు గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు వెంటనే తమిళం మయూవీ ‘అరియమలుమ్’ అనే సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇది తెలుగులో ‘కలిసుంటే’ అనే పేరుతో రిలీజ్ అయింది.

ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో సినిమాల్లో నటించి దూరమైంది. కానీ తమిళం, కన్నడ, పంజాతీ, హిందీ బాషల్లోని కొన్ని సినిమాల్లో నటంచి సమీక్ష కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా కనిపించింది. అయితే 2020లో సింగపూర్ కు చెందిన సింగర్ షేల్ ఓస్వాల్ నుం పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో కనిపించకపోయినా భర్తతో కలిసి నిర్మాతగా పనిచేసింది. ఓ సినిమాకు డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత కనిపించకుండా పోయిన సమీక్ష ఇటీవల సోషల్ మీడియాలో తన ఫొటోలతో మెరిసింది.
లేటేస్టుగా సమీక్ష ఫొటోలు అందంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని బ్యూటీ నెస్ తో ఉన్న సమీక్షను చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయ్యారా? అని కొందరు కామెంట్ పెట్టగా సమీక్ష స్పందించలేదు. కానీ అవకాశం వస్తే రెండోసారి సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.