Soundarya Husband: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నిన్నటి తరం లో సావిత్రి గారి రేంజ్ హీరోయిన్ అనిపించుకున్న ఏకైక నటి సౌందర్య గారు..ఈమెని చూస్తే మన ఇంట్లో ఆడపిల్లలాగానే అనిపిస్తుంది..ఏ హీరో కి జోడి కట్టిన మేడ్ ఫార్ ఈచ్ అథర్ అనిపించే రేంజ్ హీరోయిన్ ఆమె..అందుకే ఆమె ఈరోజు మన మధ్య లేకపోయినా ఇప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉన్నాం..ఎవరైనా హీరోయిన్ చక్కగా కనిపిస్తే చాలు..చూడండి ఆ అమ్మాయి సౌందర్య గారిలాగా ఎంత చక్కగా ఉందొ అని పొగుడుతారు..ఆడియన్స్ లో ఆమెకి ఉన్న ఇమేజి అలాంటిది..కేవలం అందం తో మాత్రమే కాదు..అభినయం తో కూడా హీరోయిన్స్ అద్భుతంగా రాణించగలరు అని నిరూపించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య గారు..దురదృష్టం కొద్దీ ఆమె హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ప్రాణాలను కోల్పోవడం తెలుగు సినీ పరిశ్రమ చేసుకున్న దౌర్బాగ్యం..ఆమె లేని లోటు ఎవ్వరు పూడవలేనిది..బ్రతికి ఉంటె ఆమె ఇంకా ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసేవారో.

ఇది ఇలా ఉండగా 2003 వ సంవత్సరం లో ఈమె తన చిన్ననాటి స్నేహితుడు రఘు అనే అతనిని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..వృత్తి రీత్యా ఇతను బెంగళూరు లో ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్..సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఇతను ఏమయ్యాడు..ఎక్కడ ఉంటాడు..ఏమి చేస్తున్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు..ఆమె చనిపోయిన తర్వాత రఘు చాలా కాలం వరుకు తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళాడట.

.ఆయన కోలుకోడానికి చాలా సమయమే పట్టింది..ఇక ఆ తర్వాత ఆయనకీ 2011 వ సంవత్సరం లో రెండవ పెళ్లి చేసారు ఇంట్లో వాళ్ళు..ప్రస్తుతం ఆయన గోవా లో ఉంటున్నట్టు సమాచారం..ఇక సౌందర్య గారు నివాసం ఉండే ఇల్లు పాడుబడిపోయిన భూతాల బంగ్లా లాగ తయారు అయ్యింది అట..ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవ్వరి నివాసం ఉండట్లేదు..ఒకప్పుడు కళకళలాడుతూ వెలుగుతూ ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఆలా బోసి పడిపోవడం చూసి చాలా బాదపడిపోతున్నారట అక్కడ ఉన్న స్థానికులు.