https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ ‘ మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేయబోతుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్లకు ఉన్న స్టార్ డమ్ ను కాపాడుకుంటూ ప్రేక్షకులకు నచ్చే సినిమా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరీ ఈ క్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2025 / 08:35 AM IST

    Game Changer(7)

    Follow us on

    Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ సైతం తన సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఈరోజు ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలు ఉండడంతో సినిమాకి భారీగా ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి అంటూ మొదటి నుంచి లెక్కలైతే వేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తు ముందుకు సాగుబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. అంటూ ట్రెడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు.

    ఇక ఇప్పటివరకు పుష్ప 2 భారీ కలెక్షన్స్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్న సమయాన గేమ్ చేంజర్ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అటు రామ్ చరణ్, ఇటు శంకర్ ఇద్దరు కూడా సక్సెస్ బాట పట్టబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం అనేది కొంతవరకు మంచి విషయమనే చెప్పాలి.

    ఇక ఇప్పటికి మెగా ఫ్యాన్స్ మొత్తం ఈ సినిమా చూసి సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఇక రామ్ చరణ్ ఈ సినిమా సక్సెస్ తో మరోసారి పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఆయన చేసిన ఈ సినిమా ఎట్టకేలకు మొదటి రోజు 250 కోట్ల వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు చెప్పిన అంచనాలు నిజమవుతాయా లేదంటే కలెక్షన్స్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

    మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా స్థాయిని మరోసారి పైకి తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను రాబడుతుంది. తద్వారా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి వండర్స్ ను క్రియేట్ చేసాడు అనేది…