Senior Heroes Remunerations: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది. పాన్ ఇండియాలో భారీ సినిమాలను చేస్తూ భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ఛార్జ్ చేస్తున్నారు. స్టార్ హీరో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్లు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. దానికి తోడుగా టికెట్ రేట్లను కూడా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది… ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపే ఆసక్తిగా చూస్తున్నారు కాబట్టి భారీ రేంజ్ లో సినిమాలను చేసి గొప్ప సక్సెస్ లను సాధిస్తే అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణంగా మారుతుందని కొంతమంది భావిస్తున్నారు…
ఇక సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి నటులు సైతం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తుండడం విశేషం…చిరంజీవి ఒక సినిమాకి 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే ఈ సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.
కాబట్టి ఆయన కూడా తన రెమ్యూనరేషన్ 35 కోట్లకు పెంచినట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జున 25 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు… బాలయ్య బాబు వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు కాబట్టి వరకు తను 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే సీనియర్ హీరోలు సైతం స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో తమ హవాని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు…
ఇప్పుడు ఒక్కో హీరో రెండు సినిమాలకు కమిట్ అయి సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు…వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు కామెడీ, ఫ్యామిలీ సబ్జెక్టులను నమ్ముకొని ముందుకు సాగుతుంటే చిరంజీవి, బాలయ్య బాబు మాత్రం మాస్ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని పూర్తి కమర్షియల్ స్టాండర్డ్స్ తో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…ఇదే రేంజ్ లో వీళ్ళు కనక ముందుకు సాగితే మాత్రం స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే విధంగా కలెక్షన్స్ ను కొల్లగొడుతూ మరోసారి తమ హవా కొనసాగించే అవకాశాలైతే ఉన్నాయి…