Prabhas assets: యంగ్ రెబల్ స్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన నటుడు ప్రభాస్… బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కూడా టచ్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసి భారీ సక్సెస్ లను సాధించిన హీరోగా తన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది ఏంటి అంటే ప్రభాస్ ఆస్తుల విలువ ఎంత అంటూ చాలామంది చాలా రకాల పోస్టులనైతే పెడుతున్నారు. నిజానికి ప్రభాస్ రాజుల వంశంలో పుట్టాడు కాబట్టి స్వతహాగా వాళ్లకు చాలా ఆస్తులైతే ఉన్నాయి. ఇక కృష్ణంరాజు హీరోగా మారిన తర్వాత ఆస్తులను పెంచే ప్రయత్నం చేశాడు…
ఇక ప్రభాస్ వాళ్ళ నాన్న కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను నిర్మిస్తూ బిజినెస్ లను చూసుకుంటూ చాలా సంపాదించారనే వార్తలు కూడా వస్తున్నాయి. కృష్ణంరాజు ప్రభాస్ వాళ్ళ నాన్న సూర్యనారాయణ రాజు సంపాదించింది పక్కన పెడితే ప్రభాస్ స్వతహాగా ఎంత సంపాదించాడు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…
ప్రస్తుతం ప్రభాస్ అటు సినిమాలు చేస్తూ ఇటు బిజినెస్ లను కూడా చూసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ 6000 కోట్ల వరకు ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక సినిమాకి దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు…ఇక మీదట నుంచి ప్రభాస్ సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
ఇక ఆస్తుల విషయంలో భారీ రేంజ్ లో సంపాదించిన ప్రభాస్ సినిమాలను కూడా అదే రేంజ్ లో చేసి సూపర్ సక్సెస్ లను సాధించే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక కృష్ణంరాజు ఆస్తుల విలువ 4000 కోట్ల వరకు ఉంటుంది. ప్రభాస్ మాత్రం కృష్ణంరాజు కంటే ఎక్కువ సంపాదించాడుంటూ చాలా గొప్ప గా చెబుతున్నారు. నటనలోనే కాదు ఆస్తుల్లో కూడా ప్రభాస్ పెద్ద నాన్న ను మించిపోయాడంటూ కామెంట్స్ చేస్తూ ఉంటడం విశేషం…