Sukumar Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. స్టైలిష్ స్టార్ గా అర్జున్ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు. పుష్ప క్రియేట్ చేసిన సంచలనంతో లాభాల పంట పండింది. దీంతో అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాగా పుష్ప రికార్డులు బద్దలు కొట్టింది. ఇక పుష్ప2 మీద దృష్టి కేంద్రీకరించారు. దర్శకుడు సుకుమార్ పుష్ప2 సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. పుష్ప సినిమాకు దర్శకుడు సుకుమార్ రూ.15-20 కోట్లు తీసుకున్నారు. కానీ సినిమా మాత్రం రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దీంతో పుష్ప 2 సినిమాకు లాభాల్లో షేర్ తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

పుష్ప సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నిర్మాతలకు దాదాపు రూ.300 కోట్ల వరకు రావడం గమనార్హం. పుష్ప కోసం అల్లు అర్జున్ రూ.50 కోట్ల తీసుకున్నాడు. ఇక పుష్ప 2 కోసం రూ. 110 కోట్ల వరకు అడుగుతున్నట్లు చెబుతున్నారు. నిర్మాతల నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేసి వారిని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేయడం కంటే లాభాల్లో వాటా తీసుకోవాలని చూస్తున్నట్లు పరిశ్రమ వర్గాల వినికిడి. దీంతో పుష్ప2 మీద ఉన్న నమ్మకంతోనే లాభాల్లో గ్రాస్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సమాచారం.
Also Read: Godfather Collections: ‘గాడ్ ఫాథర్’ మొదటి రోజు వసూళ్లు..మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ సునామి
దర్శకుడు సుకుమార్ కూడా లాభాల్లో వాటా తీసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. లాభాల పరంగా చూసుకుంటే రూ.70-90 కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమాపై నమ్మకంతోనే లాభాల్లో వాటా తీసుకుంటేనే మేలనే అభిప్రాయానికి వచ్చారు. మరోసారి అల్లు అర్జున్ పుష్ప2లో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నాడు. హీరోయిన్ రష్మిక మందన్నా కూడా తనదైన శైలిలో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్ గా నిలవనుంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

పుష్ప2 సినిమా విషయంలో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ లాభాల్లో వాటా తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. సినిమాపై విశ్వాసంతోనే వారు ఇలా అనుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమా ఇంకా మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అనే ఆతృత అందరిలో నెలకొంటోంది. సుకుమార్ సృష్టించే పుష్ప2 పరిశ్రమలో ఎంత క్రేజీ సంపాదిస్తుందో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అభిమానుల మధ్య ఎన్నో ఊహలు మెదులుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
Also Read:Jr NTR Movie: నాలుగు నెలల గర్భంతో ఎన్టీఆర్ తో డాన్స్ చేశాను!
[…] […]
[…] […]