https://oktelugu.com/

Director Teja: తేజ చిత్రం సినిమా కి ఎంత రెమ్యూన రేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు…

తేజ తన మొదటి సినిమా అయిన చిత్రం సినిమాకి రెమ్యూన్ రేషన్ గా కేవలం 11000 రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ఇక తనే కాకుండా తన టీమ్ అందరికీ కూడా 11 వేల రూపాయలను ఇచ్చారట.

Written By:
  • Gopi
  • , Updated On : March 9, 2024 / 06:23 PM IST

    Director Teja

    Follow us on

    Director Teja: సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్న కూడా విలక్షణ దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు తేజ.. తను చేసిన మొదటి సినిమా నుంచి సంచలనాలను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈయన తీసిన చిత్రం, నువ్వు నేను, జయం సినిమాలైతే అప్పట్లో యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేశాయనే చెప్పాలి. ఈ మూడు సినిమాలతో ఉదయ్ కిరణ్, నితిన్ ఇద్దరు స్టార్ హీరోలుగా మారిపోయారు.

    తేజ తన మొదటి సినిమా అయిన చిత్రం సినిమాకి రెమ్యూన్ రేషన్ గా కేవలం 11000 రూపాయలు మాత్రమే తీసుకున్నారట. ఇక తనే కాకుండా తన టీమ్ అందరికీ కూడా 11 వేల రూపాయలను ఇచ్చారట. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరికీ గోల్డ్ కాయిన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తేజ రానాని హీరోగా పెట్టి ‘ రాక్షస రాజా ‘ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటానని తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.

    ఇక ఈ సినిమాలో రానా క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంది. ఇక అదే క్యారెక్టర్ ని ఈ సినిమాలో కూడా కొనసాగింపుగా చేస్తూ ఈ సినిమా స్టోరీ ని రాసుకున్నట్టుగా తెలుస్తుంది. గత రెండు మూడు సినిమాల నుంచి తేజ కూడా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో తేజకి, రానాకి ఇద్దరికీ మంచి సక్సెస్ పడుతుందని ఇద్దరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

    అయితే తేజ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు. అయితే నిజం సినిమాతో మహేష్ బాబు ను డైరెక్ట్ చేసినప్పటికీ ఆయన అప్పటికి స్టార్ హీరో గా ఎదగలేదు. ఇక ఇది ఇలా ఉంటే తేజ ఇప్పుడనే కాదు ఇక ఫ్యూచర్లో కూడా తను ఏ ఒక్క స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయకూడదనే కాన్సెప్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది…