Homeఎంటర్టైన్మెంట్Actor Naresh and Pavithra Lokesh: పవిత్ర లోకేష్ కంటే నరేష్ వయసులో ఎంత పెద్దవాడో...

Actor Naresh and Pavithra Lokesh: పవిత్ర లోకేష్ కంటే నరేష్ వయసులో ఎంత పెద్దవాడో తెలిస్తే షాక్ అవుతారు!

Actor Naresh and Pavithra Lokesh: సినిమా వాళ్ళ జీవితాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. వాళ్ళు రాత్రంతా పని చేసి పగలు నిద్రపోతారు. జీవగడియారం నార్మల్ గా ఉండదు. తిండికి, నిద్రకు ఒక టైం అంటూ ఉండదు. నిజం చెప్పాలంటే ఓ బిజీ సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్ కి క్షణం తీరిక ఉండదు. కుటుంబానికి సమయం కేటాయించలేరు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి దారి వాళ్లదే. కోరింది తినడానికి తాగడానికి చేతినిండా డబ్బులు మాత్రం ఉంటాయి. బంధాలు మాత్రం చాలా బలహీనంగా ఉంటాయి. విడాకులకు దారితీసే పరిస్థితులు కూడా ఇవే.

Actor Naresh and Pavithra Lokesh
Actor Naresh and Pavithra Lokesh

నటుడు నరేష్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. ఆయన తల్లిగారు విజయనిర్మల స్టార్ హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్. నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యాడు. వయసొచ్చాక హీరోగా బిజీ అయ్యారు. సొంతగా సంపాదన మొదలుపెట్టాడు. తల్లి వద్ద గారాబంగా పెరిగిన నరేష్ మొదటి నుండి లగ్జరీ లైఫ్ ఇష్టపడతాడని సమాచారం. ఈ విలాస ప్రియుడికి తల్లి యుక్తవయసులోనే ఓ అమ్మాయితో వివాహం చేసింది. ఆమెతో విడిపోయారు. తర్వాత మరో రెండు పెళ్లిళ్లు జరిగాయి. వాళ్లతో కూడా ఆయన బంధం నిలబడలేదు. మూడో భార్య రమ్య రఘుపతితో నరేష్ విడిపోయి కేవలం రెండు మూడేళ్లు అవుతుంది. రమ్య రఘుపతి ఆయన కంటే వయసులో చాలా చిన్నది. ఆమెతో నరేష్ పిల్లల్ని కన్నట్లు సమాచారం.

Also Read: Chor Bazaar Movie Review: చోర్ బజార్ మూవీ రివ్యూ

ఇటీవల రమ్యపై ఆర్థిక నేరారోపణలు వచ్చాయి. ఆమె నరేష్, కృష్ణ కుటుంబం పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశారని కొందరు ఫిర్యాదు చేశారు. ఆమెతో నేను చాలా కాలం క్రితమే విడిపోయాను, నాకు ఎలాంటి సంబంధం లేదని నరేష్ వివరణ ఇచ్చారు. తాజాగా నటి పవిత్ర లోకేష్ తో నాలుగో వివాహానికి ఆయన సిద్ధమయ్యారు. మూడో భార్య రమ్యతో విడిపోయిన నరేష్ కొన్నాళ్లుగా పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ లో కలిసి ఉంటున్నట్లు సమాచారం. వీరు రహస్య వివాహం కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏజ్ గ్యాప్ చూస్తే మైండ్ పోతుంది.

Actor Naresh and Pavithra Lokesh
Pavithra Lokesh

1960 జనవరి 20న జన్మించిన నరేష్ ప్రస్తుత వయసు 62 సంవత్సరాలు. అదే సమయంలో పవిత్ర లోకేష్ 1979 లో జన్మించగా ఆమె వయసు 43 ఏళ్ళు. అంటే ఏకంగా 19 ఏళ్ళు నరేష్ ఆమె కంటే పెద్దవాడు కావడం కొసమెరుపు. ఇక ప్రేమకు వయసు లేదంటారు. అది ఎప్పుడు ఎవరిమీదైనా కలగొచ్చు. వృత్తిపరంగా ఏర్పడిన పరిచయం వాళ్ళను మానసికంగా దగ్గర చేసింది. ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టించింది. అయితే పవిత్ర లోకేష్ మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ ని కూడా ఆమె ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సుచేంద్రకు మాత్రం ఆమె రెండో భార్య.

Also Read:Hemachandra- Sravana Bhargavi: స్టార్ సింగర్స్ హేమచంద్ర-శ్రావణ భార్గవి విడిపోతున్నారు? ఆందోళనలో ఫ్యాన్స్!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular