Balakrishna Remuneration: వెండితెరపై ‘హీరోగా’ వెలుగు వెలుగుతున్న బాలయ్య బాబును బుల్లితెరపైకి తీసుకురావాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆశించాడు.. చివరకు విజయం సాధించాడు. ‘అన్ స్టాపబుల్’ పేరిట బాలయ్యను హోస్ట్ గా పెట్టి ‘ఆహా’ ఓటీటీలో చేసిన ఇంటర్వ్యూలు హిట్ అయ్యాయి. ఇది మొదటి సీజన్ పూర్తి కావడంతో రెండో సీజన్ కు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ‘అన్ స్టాపబుల్2’ సీజన్ స్ట్రాట్ చేయడానికి ‘ఆహా ఓటీటీ’ రెడీ అయ్యింది.

Balakrishna
మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ కోసం బాలయ్యకు కాస్త ఎక్కువగానే రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ‘ఆహా’ ఓనర్ అల్లు అరవింద్ రెడీ అయ్యారట.. ఈ రెండోసీజన్ కు బాలయ్య పారితోషికాన్ని పెంచాడని వార్తలు వస్తున్నాయి.
బాలయ్య సినిమాల్లో డైలాగులు బాగానే పేల్చుతాడు. కానీ బయట దీర్గాలు తీస్తూ తడబడుతుంటాడు. ఈ క్రమంలోనే ఆయనను పెట్టి షో నిర్వహించడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ ‘అన్ స్టాపబుల్’ పేరిట తొలి టాక్ షోలో బాలయ్య దడదడలాడించాడు. ఈ షోను హిట్ చేయించాడు. అందుకే రెండోసీజన్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
ఇండస్ట్రీలోని ప్రముఖ నటీనటులను , ప్రముఖులను ఈ షోకు ఆహ్వానించి వారితో సరదా సంభాషణ చేస్తూ ఏమాత్రం తగ్గకుండా వారి మద్యం అలవాట్లను కూడా బయటపెట్టిస్తూ బాలయ్య సంచలనం సృష్టించాడు. ఇప్పుడు సెకండ్ సీజన్ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి బాలయ్య ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది వేచిచూడాలి.

Balakrishna
ఆగస్టు 15 నుంచి బాలయ్య ‘అన్ స్టాపబుల్2’ షో ప్రసారం కానుందని సమాచారం. బాలయ్యలోని మరో కోణాన్ని బయటపెట్టిన ఈ షో ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాతల హీరో అయిన బాలయ్య పారితోషికం విషయంలో ఎక్కువగా డిమాండ్ చేయడం లేదట.. ‘అన్ స్టాపబుల్’ మొత్తం 10 ఎపిసోడ్లతో ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి బాలయ్య పారితోషికం కేవలం రూ.1 కోటి మాత్రమే అని సమాచారం. మొదటి సీజన్ హిట్ అయినా కూడా రెండో సీజన్ కు బాలయ్య తన పారితోషికం పెంచకుండా నిర్మాత అల్లు అరవింద్ కు సహకరిస్తున్నట్టు తెలిసింది.
అయితే నిర్మాత అల్లు అరవింద్ మాత్రం బాలయ్యకు మరో 50 లక్షలు అదనంగా ఇవ్వాలని.. షోకు రూ.25 లక్షలు ఫిక్స్ చేసినట్టు సమాచారం. 10 షోలకు రూ.2.5 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట..
ఇక రెండో సీజన్ కు రాబోయే మొదటిగెస్ట్ చిరంజీవి అని ప్రచారం సాగుతోంది.ఇద్దరు అగ్రహీరోలు ఒకే స్టేజ్ మీద కనిపిస్తే అది అభిమానులకు పండుగే. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
Also Read:Chor Bazaar Movie Review: చోర్ బజార్ మూవీ రివ్యూ