NTR’s ‘Bala Ramayanam’ collections : మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ‘నిన్ను చూడాలని’ సినిమాకి ముందు ‘బాల రామాయణం’ అనే సినిమాతో ప్రారంభం అయ్యింది అనే విషయం తెలిసిందే..ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన రెండవ సినిమా ఇది..మొదటి సినిమా వాళ్ళ తాత గారు ఎన్టీఆర్ నటించిన ‘విశ్వామిత్ర’ లో బాలనటుడిగా ఒక చిన్న పాత్ర చేసాడు..అది పెద్దగా సక్సెస్ కాలేదు..కానీ ‘బలరామాయణం’ మాత్రం అప్పట్లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

చిన్న పిల్లలతో తీసిన ఈ సినిమాకి ‘నేషనల్ అవార్డు’ కూడా దక్కింది..శ్రీ రామునిగా ఎన్టీఆర్ నటన అద్భుతం అనే చెప్పాలి..అంత చిన్న వయస్సు లో శ్రీ రాముడి వేషం వేసి సంస్కృతం లో డైలాగ్స్ మరియు పద్యాలూ చెప్పడం అంటే సాధారణమైన విషయం కాదు..ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికీ అప్పట్లో ఎవరీ కుర్రాడు..ఇంత అద్భుతంగా నటించాడు అని అనిపించిందట..అయితే ఈ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డ్స్ గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో మాట్లాడుకోబోతున్నాము.
ఈ చిత్రాన్ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద MS రెడ్డి 3000 మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ తో తెరకెక్కించారు..గుణశేఖర్ దర్శకత్వం వహించాడు..1997 వ సంవత్సరం ఏప్రిల్ 11 వ తారీఖున విడుదలైన ఈ సినిమాకి అప్పట్లో నేషనల్ అవార్డు మరియు నంది అవార్డు దక్కింది..అంతే కాదు ఆరోజుల్లో ఈ చిత్రానికి కోటికి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట..కలెక్షన్స్ పరంగా చూస్తే ఆరోజుల్లోనే 6 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
తక్కువ బడ్జెట్ తో ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది మామూలు విషయం కాదు..ఎన్టీఆర్ కి కూడా బాలనటుడిగా ఈ సినిమా ద్వారా పలు అవార్డ్స్ వచ్చాయి..అయితే ఈ సినిమాలో 3000 వేలమంది బాలనటులు నటిస్తే కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సినిమాల్లో సూపర్ స్టార్ గా స్థిరపడ్డాడు..మిగిలిన వాళ్ళందరూ వేరే రంగాల్లో స్థిరపడ్డారు..ఈ చిత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది..ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు.