Rashmi Gautam’s wedding : సడన్ గా రష్మీ గౌతమ్ పెళ్లి ఫోటోలు తెరపైకి వచ్చింది. పెళ్లి పందిరిలో నవవధువులా రష్మీ గౌతమ్ కూర్చొని ఉన్నారు. పక్కనే ఆమె మెడలో తాళి కట్టే వరుడు కూర్చొని ఉన్నాడు. అయితే ఆయన ముఖం మల్లెదండలతో కవర్ చేశారు. దీంతో ఆయన ముఖం కనిపించలేదు. అసలు విషయంలోకి వెళితే… యాంకర్ రష్మీ గౌతమ్ పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. 32 ఏళ్ల రష్మీ పెళ్లి చేసుకుంటున్నారంటూ పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. ఇక సుడిగాలి సుధీర్ ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ పై రష్మీ-సుధీర్ ఏళ్ల తరబడి రొమాన్స్ పంచారు. దీంతో వారు నిజంగానే ప్రేమికులన్న అనుమానాలు జనాల్లో ఉన్నాయి.

దీనిపై రష్మీ కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చింది లేదు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయం పబ్లిక్ లో పంచుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ చెప్పేస్తే ఇంకా దాచుకోవడానికి ఏముంటుంది అంటూ నర్మగర్భంగా మాట్లాడుతుంది. మరోవైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోవడం లేదు. కెరీర్లో సెటిల్ అయినప్పటికీ వివాహం మాటెత్తడం లేదు. ఈ పరిణామాల దృష్ట్యా రష్మీ-సుధీర్ మధ్య స్నేహానికి మించిన రిలేషన్ ఉందనే వాదనలు కొట్టిపారేయలేం అంటారు కొందరు.
కాగా సడన్ గా ఆమె పెళ్లిపీటలపై కూర్చొని ఉన్న ఫోటో శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రదర్శించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో బుల్లితెరకు చెందిన కొందరు రియల్ కపుల్ సందడి చేశారు. ఈవెంట్ చివర్లో… రష్మీ పెళ్లి ఫోటో స్క్రీన్ పై వేసి మీ పక్కన పెళ్లిపీటలపై కూర్చునే ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని పంచ్ ప్రసాద్ అడిగారు. దానికి రష్మీ సిగ్గుపడుతూ ఏదో సమాధానం చెప్పింది. ఆమె చెప్పారనేది ప్రోమోలో చూపించలేదు. సస్పెన్సులో పెట్టారు. ఇక స్క్రీన్ పై ప్రదర్శించిన రష్మీ పెళ్లి ఫోటో కేవలం క్రియేట్ చేసింది.
అదే సమయంలో ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ ఎపిసోడ్ పై హైప్ క్రియేట్ చేసేందుకు వేసిన జిమ్మిక్కు మాత్రమే ఇది. రష్మీ తనను కట్టుకోబోయేవాడ్ని పరిచయం చేసేది లేదు. ఇలాంటివి గతంలో చాలానే చూశామని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రష్మీ ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సుడిగాలి సుధీర్ పూర్తిగా బుల్లితెరకు దూరమయ్యాడు. ఓటీటీలో కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ పేరుతో ఓ షో చేస్తున్నాడు. ఆయన హీరోగా ఫస్ట్ హిట్ కొట్టాడు. గాలోడు మూవీ మంచి వసూళ్లు సాధించింది.