Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ప్రతి చిరంజీవి అభిమాని ప్రపంచం లో ఎక్కడ ఉన్నా కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగ వాతావరణం ని తలపిస్తారు. రక్త దానాలు అన్నదానాలు ఇలా ఒక్కటా రెండా. ఎన్నో సేవాకార్యక్రమాలు చిరంజీవి పేరిట జరిపిస్తారు అభిమానులు. అయితే గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా చిరంజవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరపలేకపొయ్యారు అభిమానులు. ఇప్పుడు పరిస్థితులన్నీ సహకరిస్తుండడం తో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో జరపబోతున్నారు అభిమానులు..ఈ వేడుకలన్నీ మెగాబ్రదర్ నాగబాబు గారి నేతృత్వం లో జరగనున్నాయి..అంతే కాకుండా మెగాస్టార్ జన్మదిన సందర్భం గా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఘరానా మొగుడు’ ని స్పెషల్ షోస్ గా వేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయిపోయాయి..హైదరాబాద్ లో కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో దాదాపుగా 7 షోస్ ని వేస్తున్నారు..వీటికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో లో జరుగుతున్నాయి.
Also Read: Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?
అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకి అభిమానులు సేవ కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ప్రతి ఏడాది చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించడం అభిమానులకు అనాదిగా వస్తున్నా ఆచారం..ఈసారి రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించాలని అభిమానులు సిద్ధమైపోయారు..కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం లో చిరంజీవి గారు ఆక్సిజన్ సీలిండెర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చే విధంగా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.
AZlso Read: Indian Film Industry: ఇండియన్ సినిమా డామినేషన్.. హాలీవుడ్‌తో పోటీ..!
చిరంజీవి గారి ఈ గొప్ప ఆలోచనలను అభిమానులు చాలా సీరియస్ గా తీసుకొని ఆక్సిజన్ సీలిండెర్స్ కొరతతో బాధపడుతున్న ఎంతో మంది కరోనా బాధితులకు అందేలా చేశారు.. ఇక పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి గారు మరో మోహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..చిత్రపురి కాలనీ లో సినీ కార్మికుల కోసం ఒక ఆసుపత్రిని నిర్మించబోతున్నాడు..వచ్చే ఏడాది చిరంజీవి గారి పుట్టిన రోజు లోపు ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలనేదే టార్గెట్ అట..చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయానికి ఇండస్ట్రీ వర్గాల నుండి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.