Bigg Boss 6 Telugu Faima: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున ఈసారి మరింత జోష్ తో మొదలుపెట్టారు. ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించి ఔరా అనిపించారు. ఇంత మందిని ఒకేసారి లోపలికి పంపడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటే ఈ సంఖ్య మరింత దాటిపోతుంది.

గత సారి జబర్ధస్త్ నుంచి కమెడియన్ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇవ్వగా.. ఈసారి చలాకీ చంటిని బిగ్ బాస్ టీం లాగేసింది. ఇక జబర్ధస్త్ నుంచి మరో లేడీ కంటెస్టెంట్ ను కూడా బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. ఆమె ఎవరో కాదు ‘ఫైమా’. బుల్లెట్ భాస్కర్ టీంలో కీలక పాత్ర పోషించే ఫైమా కామెడీ చేయడంలో కింగ్. తన రూపం, ఆకారం నుంచే నవ్వులు పూయించే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది.
తెలంగాణలోని దూమకొండ అనే చిన్న పల్లెలో ఫైమా జన్మించింది.ఈటీవీలో ‘పటాస్’ షో ద్వారా స్టాండప్ కమెడియన్ గా ఫైమా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కామెడీతో తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ ను వదిలేసి స్టార్ మా నిర్వహించే బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటోంది.
జబర్ధస్త్ లో టాప్ లో ఉన్న పైమా దాన్ని వదిలేసి బిగ్ బాస్ లోకి రావడానికి స్టార్ మా నిర్వాహకులు ఆఫర్ చేసిన అత్యధిక పారితోషికమే కారణం అంటున్నారు.జబర్ధస్త్ లో స్కిట్ లో పాల్గొంటే ఆమెకు నెలకు లక్షన్నర రూపాయల పారితోషికం లభిస్తుందట.. అది నెలలో వారానికంటే మించి షూటింగ్ ఉండదు. బయట ఈవెంట్లు చేసినా కూడా 15 రోజులు పని ఉండని పరిస్తితి. అందుకే బిగ్ బాస్ లోకి వస్తే ఎక్కువ సంపాదించుకోవచ్చని ఫైమా నిర్ణయించుకొని వెళ్లినట్టు తెలుస్తోంది.

ఫైమాకు బిగ్ బాస్ లో పాల్గొంటే వారానికి రెండున్నర లక్షల పారితోషికం ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఫైమాకు ఉన్న కామెడీ టైమింగ్, మంచి పేరుకు ఫైనల్ వరకూ ఉంటే దాదాపు 30 లక్షల వరకూ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. జబర్ధస్త్ లో మూడు నెలలకు మహా అయితే ఖర్చులన్నీ పోను ఫైమా 3 లక్షల వరకూ సంపాదిస్తుంది. అదే బిగ్ బాస్ లో ఉంటే 30 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. పైగా తిండి, వ్యయం అంతా బిగ్ బాస్ టీందే. అందుకే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దనే ఫైమా బిగ్ బాస్ ఆఫర్ కు ఓకే చెప్పి జబర్ధస్త్ వదిలేసినట్టు సమాచారం.
[…] […]