Allu Sirish fiancee Nayanika: అల్లు కుటుంబం లో అతి త్వరలోనే పెళ్లి భాజాలు మ్రోగనున్నాయి. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu sirish) నైనికా అనే అమ్మాయి ని పెళ్లాడబోతున్నాడు. ఈ సందర్భంగా నిన్న ఆయన తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్ష్యంలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్దానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఎందుకంటే ఉపాసన కి రీసెంట్ గానే రెండవ సారి సీమంతం జరిగింది. అతి త్వరలోనే ఆమె కవలపిల్లలకు జన్మని ఇవ్వబోతోంది. అయినప్పటికీ కూడా నిశ్చితార్థం కి రావడం విశేషం. అదే విధంగా కొత్తగా పెళ్ళై, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదంతా పక్కన పెడితే అల్లు శిరీష్ పెళ్లాడబోతున్న నైనికా అనే అమ్మాయి ఎవరు?.
అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ బలంగా వెతికారు. కానీ ఆమె గురించి సమాచారం చాలా తక్కువగానే తెలిసింది. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఈమె హైదరాబాద్ అమ్మాయి అని తెలుస్తుంది. ఆమె పుట్టి పెరిగింది, చదువుకున్నది మొత్తం ఇక్కడే. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు, హైదరాబాద్ లో పలు కీలక వ్యాపారాల్లో అగ్రగామి. ఇక నైనికా విషయానికి వస్తే ఈమె బెంగళూరు లో రెండు మూడు ఐటీ కంపెనీస్ ని మైంటైన్ చేస్తూ వస్తోంది. ఈమె నెల సంపాదన అల్లు శిరీష్ నెల సంపాదన కంటే ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. చిన్నప్పటి నుండి నైనికా తండ్రి తో అల్లు కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండడం తో వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త పెరిగి పెద్ద అయ్యేసరికి ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలు వరకు తీసుకొచ్చింది.
ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే, ఈయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘బడ్డీ’. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం, అసలు విడుదల అయ్యింది అనే విషయం కూడా అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ కి కానీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి కానీ తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కెరీర్ మొత్తం డిఫరెంట్ సబ్జెక్టు సినిమాలు చేసాడు, రెండు మూడు మంచి హిట్స్ కూడా పడ్డాయి కానీ, ఎందుకో అవి ఆయనకు ఒక స్టాండర్డ్ మార్కెట్ ని క్రియేట్ చేయలేకపోయాయి. ప్రస్తుతం అల్లు శిరీష్ చేతుల్లో ఎలాంటి సినిమా లేదు, భవిష్యత్తులో ఏమైనా సినిమాలు చేస్తాడేమో చూడాలి.